సవతి తల్లి  కిరాతకం.. బిడ్డను సంచిలో కట్టి, ఊపేసి... - MicTv.in - Telugu News
mictv telugu

సవతి తల్లి  కిరాతకం.. బిడ్డను సంచిలో కట్టి, ఊపేసి…

December 5, 2017

సవతి తల్లి అంటే చిత్రహింసలు పెడుతుందని, చంపుకు తింటుందని సినిమాల్లో చూపిస్తుంటారు. అయితే అందరు సవతి తల్లులూ అలా ఉండరు. మనుషుల్లో మంచి, చెడ్డ ఉన్నట్లో సవతి తల్లుల్లోనూ మంచివాళ్లుంటారు, చెడ్డవాళ్లుంటారు. అయితే ఓ సవతి తల్లి మాత్రం చెడ్డ సవతి తల్లుల్లో అగ్రస్థానం దక్కించుకుంది. పనిపిల్లను దారుణంగా చిత్రహింసలు పెట్టి నరకం చూపించింది.


చండీగఢ్  సెక్టార్ 29లో నివసిస్తున్న ఈవిడ .. ఐదేళ్ల పిల్లను ఇష్టమొచ్చినట్టు కొట్టింది. అంతటితో ఆగకుండా సంచిలో కుక్కి తీవ్రంగా హింసించింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను తీసింది తన కుమారుడు. ఈ విషయం కుమారుడు తండ్రికి చెప్పాడు కానీ ఆ తండ్రి తొలుత నమ్మలేకపోయాడు.  తరువాత వీడియోలో తన రెండవ భార్య పైశాచికత్వాన్ని చూసి నివ్వెరపోయాడు. కూతురిని గుండెలకు హత్తుకొని రెండో భార్య మీద పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

తన మొదటి భార్య క్యాన్సర్‌తో చనిపోయాక పిల్లలకోసం రెండవ పెళ్లిచేసుకున్నానని తెలిపాడు. కాగా తీవ్రంగా గాయపడిన చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదిలా వుండగా సోషల్ మీడియాలో ఈ వీడియోలో సవతి తల్లి నిర్వాకానికి నెటిజనులు గుస్సా అవుతున్నారు. ‘ తనకు పుట్టకపోయినా తను కట్టుకున్న భర్తకే పుట్టారు కదా ఆ పిల్లలు అనుకోవచ్చు కదా.. లేకపోతే సాటి ఆడదాని పిల్లలే అనుకోవడంలో తప్పు లేదు కదా.. పైగా ఆ పిల్ల తనలా ఆడపిల్ల అనే కరుణ వుండదా సవతి తల్లిలో.. సవతి తల్లి అనగానే ఆడతనాన్ని, అమ్మతనాన్ని మరిచి పోతున్న ఈ వైనంలో మార్పు రాదా ? ’ అంటూ చాలా మంది కామెంట్లు చేస్తున్నారు.