How auto rickshaw blast in Mangaluru led to unraveling of terror plot
mictv telugu

ఆటో పేలుడు వెనుక ఉగ్ర కుట్ర

November 21, 2022


మంగళూరు ఆటో పేలుడు కేసులో విస్తుగొలిపే నిజాలు బయటపడుతున్నాయి. నిందితుడు షరిఖ్ ఇంట్లో పేలుడు పదార్థాలు దొరికాయి. ఐఈడీ బాంబుల తయారీకి కావాల్సిన సామగ్రిని పోలీసులు సీజ్ చేశారు. షరిఖ్‌కు ఐఎస్ఐఎస్‌తో లింకులు ఉన్నట్లు ఎన్ఐఏ అధికారులు అనుమానిస్తున్నారు.

ఉగ్ర స్కెచ్
మంగళూరులో శనివారం రన్నింగ్ ఆటోలో పేలుడు సంభవించింది.భారీగా పొగలు వచ్చాయి. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రయాలు అయ్యాయి. ఆటో పేలుడు ఘటనపై పోలీసులకు అనుమానం వచ్చింది. స్పాట్‌ని పరిశీలించిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. ఇది యాక్సిడెంట్ కాదని, పేలుడు అని నిర్దారణకు వచ్చారు. ఆటో డ్రైవర్‌ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ప్యాసింజర్ దగ్గర ఓ బ్యాగ్ ఉందని అతను చెప్పాడు. ఆటోలో ప్రయాణించింది షరిఖ్‌గా పోలీసులు గుర్తించారు. ఫేక్ ఆధార్ కార్డు, పాస్ పోర్ట్ ఉన్నట్లు కనుకొన్నారు. షరిఖ్‌ని ప్రశ్నించిన పోలీసులు అతని ఇంట్లో సోదాలు జరిపారు. పెద్దయెత్తన పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఐఈడీ బాంబుల తయారీకి కావాల్సిన సామగ్రిని సీజ్ చేశారు. కుక్కర్ బాంబ్‌ని షరిఖ్ తయారు చేశారు. కుక్కర్ బాంబ్‌తో దిగిన ఫొటోల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మంగళూరు సహా అనేక ప్రాంతాల్లో పేలుళ్లకు స్కెచ్ వేశాడని తెలుస్తోంది.బెంగళూరు రైల్వే స్టేషన్ , ఎయిర్ పోర్ట్‌లలో హై అలర్ట్ ప్రకటించారు. బస్టాండ్లు, పర్యాటక ప్రాంతాల్లో నిఘా పెంచారు.

లోతుగా విచారణ

“ఇది యాక్సిడెంట్‌గా జరిగింది కాదు.ఇది పక్కా పేలుడు.దీనిపై విచారణ జరుపుతున్నాం. కేంద్ర దర్యాప్తు సంస్థలతో కలిసి లోతుగా విచారణ చేస్తున్నాం. బాంబ్ స్క్వాడ్ , డాగ్ స్క్వాడ్, ఎన్ఐఏ అధికారులు స్పాట్‌ని పరిశీలించారు” అని కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్ చెప్పారు. షరిఖ్ ఇటీవల పలు ప్రాంతాల్లో తిరిగాడని, కోయంబత్తూరు కూడా వెళ్లివచ్చాడని ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై అన్నారు. ఉగ్ర కుట్ర కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారని ఆయన చెప్పారు. మైసూర్‌లోని షరిఖ్ అద్దెకు ఉన్న ఇంట్లో భారీగా పేలుడు సామగ్రిని అధికారులు సీజ్ చేశారు. జిలెటిన్ స్టిక్స్, సర్క్యూట్ బోర్డు, బోల్టులు, కుక్కర్ ,మొబైల్ , బ్యాటరీలు స్వాధీనం చేసుకున్నారు.

కోయంబత్తూరు పేలుడుతో లింక్ ?
అక్టోబర్ 23 కోయంబత్తూరులో మారుతీ వ్యాన్‌లో ఇలాంటి పేలుడే సంభవించింది. కొట్టయన్ ఈశ్వరన్ గుడికి సమీపంలో ఘటన జరిగింది. ఈ ఘటనలో ఓ వృద్దుడు చనిపోయాడు.మృతుడ్ని జమేజా ముబిన్‌గా గుర్తించారు. షరిఖ్ మంగళూరు నుంచి కోయంబత్తూరుకి వెళ్లివచ్చాడు. దీనికి అతనికేమైనా సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.