how brilliantly Ashwin did it Virat Kohli On Ravi Ashwin On Last Ball India Pakistan Match
mictv telugu

కోహ్లీ కాదు సైన్స్ గెలిపించింది.. టీమిండియా విజయంపై కొత్త వాదన

October 26, 2022

ఇండియా- పాకిస్తాన్ మధ్య జరిగిన చారిత్రాత్మక క్రికెట్ మ్యాచ్ మేనియా ఇండియాలో ఇంకా ముగియటంలేదు. నో బాల్, అంపైర్ల తప్పిదాలు అంటూ నెగిటీవ్ కాంట్రవర్సీలతో పాకిస్తాన్‌లో వార్తలు వస్తుంటే.. విరాట్ విజృంభణపై విశ్లేషణలు భారత్‌లో ఇంకా దంచికొడుతున్నాయి. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ ఆఖరి బంతికి జరిగిన మ్యాజిక్ వివరించాడు. రెండు బంతుల్లో రెండు పరుగులు రావాల్సిన సమయంలో దినేష్ కార్తీక్ స్టంప్ అవుట్ అయ్యాకా క్రీజ్ లోకి వచ్చిన అశ్విన్ మేధస్సుని, ధైర్యాన్ని కోహ్లీ మెచ్చుకున్నాడు. తాను చెప్పిన మాట వినకుండా అశ్విన్ చేసిన పని గ్రేట్ అంటూ కామెంట్స్ చేశాడు కోహ్లీ. ప్రస్తుతం సోషల్ మీడియాలో అశ్విన్ పై కోహ్లీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఒక స్పోర్ట్స్ ఛానల్ నిర్వహించిన కార్యక్రమంలో అశ్విన్‌పై కోహ్లీ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశాడు.

రవిచంద్రన్ అశ్విన్ ఎంత బ్రిలియంట్ ప్లేయరో వివరించాడు కోహ్లీ. ‘‘అత్యంత డ్రమెటిక్‌గా డీకే రనౌట్ అయ్యాకా.. అశ్విన్ క్రీజ్ లోకి వచ్చాడు. అప్పుడు మనకి ఒక బంతిలో రెండు పరుగులు అవసరం. దాంతో నేను అశ్విన్ దెగ్గరికి వెళ్లి మిడాన్ మీదుగా బంతిని కొట్టమని సలహా ఇచ్చాను. అయితే లెగ్ స్టంప్ అవతలకి వెళ్తున్న పాకిస్తాన్ స్పిన్నర్ నవాజ్ బంతిని అత్యంత దైర్యంగా వదిలేశాడు అశ్విన్. అలా వదిలేయడానికి గట్స్ ఉండాలి. దాన్ని మించి తెలివి కూడా కావాలి. ఆ క్షణంలో అశ్విన్ బ్రెయిన్ సూపర్‌గా పనిచేసింది. అశ్విన్ బంతిని వదిలేయడంతో వైడ్ రూపంలో ఒక ఎక్‌స్ట్రా పరుగు వచ్చింది. దాంతో భారత్ లక్ష్యం మరింత సునాయాసం అయింది. ఒక్క బంతికి ఒకే పరుగు చేయాల్సిన నేపధ్యంలో జస్ట్ గ్యాప్‌లో బంతి కొడితే చాలు విజయం సాధించొచ్చు అని ధీమా వచ్చేసింది. అశ్విన్ కూడా అదే చేసి ఇండియాకి మరుపురాని విజయాన్ని అందించాడు. అశ్విన్ నిజమైన శాస్త్రవేత్త అంటూ కోహ్లీ ప్రశంసలు కురిపించాడు. అయితే ఎప్పటి నుండో అశ్విన్ ని టీమిండియా ప్లేయర్లు సైంటిట్స్ అనే నిక్‌నేమ్ తో పిలుస్తారు.