దుబాయ్ అంటేనే ఆకాశహార్మ్యాలు ఎక్కువ. ఇప్పటికే బుర్జ్ ఖలీఫా టాప్ లో ఉంది. దీనికి తోడు మరో అతి పెద్ద భవనం నిర్మితమవుతున్నది. నివాసయోగ్యమైన ఈ టవర్ గురించే ఈ కథనం..
లగ్జరీ టవర్ వచ్చేసింది. ఇది దుబాయ్ లో బుర్జ్ బింఘట్టి జాకబ్ అండ్ కో రెసిడెన్సెస్ ద్వారా ఆవిష్కరించబడింది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన నివాస భవనాల్లో ఒకటిగా రికార్డు సృష్టించడానికి సిద్ధంగా ఉన్న ఆకాశహర్మ్యం. పైన అన్ని డైమండ్స్ మెరుస్తూ కనిపిస్తుంటాయి.
ప్రాజెక్ట్ రెండు లేదా మూడు బెడ్ రూమ్ లను అందించే విలాసవంతమైన నివాసాలను కలిగి ఉన్న 100 అంతస్తుల భవనం ఇది. మరో 12 అంతస్తులను పెంట్ హౌస్ ల మాదిరి నిర్మించనున్నారట. అలా చూస్తే మొత్తం 112 అంతస్తుల భవనం. జాకబ్ అండ్ కో వాచ్ మేకింగ్, జ్యువెలరీ బ్రాండ్, దుబాయ్ లోని ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్, బింఘట్టిచే సహ సంతకం, సహ రూపకల్పనతో ఈ భవనం ప్రత్యేకతను కలిగి ఉంది. ఈ భవనం సేవలను అందిస్తున్నది. అనేక స్థాయిలను కలిగి ఉంది. దుబాయ్ మొత్తం స్కైలైన్ కి ఎదురుగా ఉన్న ఇన్ఫినిటీ పూల్, లగ్జరీ స్పా, జిమ్ వంటి ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి.
టవర్ లో రెండు బెడ్రూమ్లతో సఫైర్ సూట్స్, మూడు బెడ్రూమ్లతో ఎమరాల్డ్ సూట్స్ ఉ:టాయి. పెంట్ హౌస్లు మూడు రకాలుగా ఉంటాయి. అందులో ఫ్లూర్స్ డి జార్డిన్ పెంట్ హౌస్, ఆస్ట్రోనోమియా పెంట్ హౌస్, బిలియనీర్ పెంట్ హౌస్. హైపర్ టవర్ మొత్తం డిజైన్ ప్రక్రియలో పాలు పంచుకోవడంతో పాటు జాకబ్ అండ్ కో ప్రత్యేకంగా క్యూరేటెడ్ గడియారాలు, ఆభరణాలను కూడా అందిస్తుంది. వీటిలో ఎక్కువ భాగం ప్రత్యేకమైన లేదా పరిమిత ఎడిషన్, కస్టమర్ వారు ఎంచుకునే నివాసాన్ని కొనుగోలు చేయవచ్చు. అయితే దీనికి మాత్రం 2.1 మిలియన్ డాలర్లను ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంటే మన కరెన్సీలో సుమారు 17 కోట్ల రూపాయల పై మాటే అన్నమాట.