అరె ఎలా ఔట్ అయ్యాడు?..బౌలర్ కన్ప్యూజన్ - MicTv.in - Telugu News
mictv telugu

అరె ఎలా ఔట్ అయ్యాడు?..బౌలర్ కన్ప్యూజన్

June 24, 2022

న్యూజిలాండ్‌ బ్యాట్‌మెన్ హెన్రీ నికోల్స్‌‌కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఇంగ్లండ్‌ బౌలర్ జాక్ లీచ్‌ బంతిని విరిసిన క్షణాల్లోనే హెన్రీ నికోల్స్‌ ఔట్‌ అయ్యాడు. దాంతో బౌలర్ ఎలా ఔట్‌య్యాడు అబ్బా అని చుట్టుపక్కల చూస్తూ, కన్ప్యూజన్‌లో పడ్డాడు.

వివరాల్లోకి వెళ్తే.. లీడ్స్‌ వేదికగా ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ల మధ్య అఖరి టెస్టు ఇటీవలే జరిగింది. ఈ టెస్టులో విచిత్రకర రీతిలో న్యూజిలాండ్‌ బ్యాట్‌మెన్ హెన్రీ నికోల్స్‌ ఔట్ అయ్యాడు. న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌ 55 ఓవర్‌ వేసిన జాక్ లీచ్‌ బౌలింగ్‌లో నికోల్స్ నాన్‌ స్ట్రైకర్‌వైపు భారీ షాట్‌ ఆడాడు. అయితే, బంతి నేరుగా నాన్‌స్ట్రైకింగ్‌లో ఉన్న మిచెల్‌ బ్యాట్‌కు తగిలి, మిడ్-ఆఫ్ ఫీల్డర్‌ అలెక్స్ లీస్ చేతుల్లోకి వెళ్లింది. దీంతో నికోల్స్‌ నిరాశగా మైదానాన్ని వీడాడు. కానీ, నికోల్స్‌ ఔట్‌కాగానే ఇంగ్లండ్‌ బౌలర్లు సంబురాలు జరుపుకోగా, బౌలర్‌ లీచ్‌ మాత్రం ఆశ్చర్యంగా అలా ఉండిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో షేర్ చేయడంతో వీక్షిస్తున్న సినీ ప్రియులు సైతం ఆశ్చర్యానికి గురౌతున్నారు.

 

మరోపక్క నికోల్స్‌ ఔటైన విధానంపై మేరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ స్పందించింది. “దురదృష్టకరమైన రీతిలో నికోల్స్‌ తన వికెట్‌ను కోల్పోయాడు. కానీ ఇది పూర్తిగా చట్టాలకు లోబడి ఉంది. నియమం ​33.2.2.2 ప్రకారం బంతి.. వికెట్‌, అంపైర్‌, ఫీల్డర్, ఇతర బ్యాటర్‌ని తాకిన తర్వాత క్యాచ్ తీసుకుంటే అది ఔట్‌గా పరిగణించబడుతుంది” అని మేరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ ట్విటర్‌లో పేర్కొంది.