చలికాలంలో ఎన్నో వ్యాధులకు కారణం అవుతుంది. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఇన్ఫెక్షన్లకు గురవుతుంటారు. అయితే చలికాలంలో బెల్లం తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయని మీకు తెలుసా. బెల్లంను ఎన్నో పద్దతుల్లో తీసుకోవచ్చు. వంటకాల్లోనూ బెల్లం చేర్చుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.చక్కెరతో పోల్చితే బెల్లం ఆరోగ్యానికి మంచిది. కానీ చాలామంది చక్కరనే ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అయితే బెల్లంలో ఐరన్, విటమిన్ సి, ప్రొటీన్, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. కడుపులో ఉబ్బరం, చెడు దుర్వాసనను దూరం చేసేందుకు కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. బెల్లం ఆహారంలో జోడించే మార్గాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.
బెల్లం పాలు
ప్రతిరోజూ గ్లాస్ లేదా కప్పు పాలలో కొంత బెల్లం కలుపుకుని తీసుకుంటే ఇమ్యూనిటీ లెవెల్స్ పెరుగుతాయి. బెల్లం పాలు తీసుకోవడం మహిళలకు పీరియడ్స్ సమయంలో కడుపు నొప్పి లేదా తిమ్మిరి తగ్గుతుంది. జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండటంతోపాటుగా అజీర్థి సమస్య ఉండదు.
పప్పు
బెల్లం స్వీట్లు తయారీలో మాత్రమే కాదు..కారం కూరల్లోకూడా వాడుతారు. పప్పులో బెల్లం వేస్తే రుచి మరింత పెరుగుతుంది. ఉప్పుతోపాటు రుచిని కూడా సమతుల్యం చేస్తుంది. రక్తహీనతతో బాధపడేవారికి బెల్లం చక్కటి ఔషధంలా ఉపయోగపడుతుంది.
హల్వా
హల్వాలో చక్కెరకు బదులుగా బెల్లం ఉపయోగించండి. ఇది మీ ఆహారంలో ఐరన్ శాతాన్ని పెంచుతుంది. హల్వాను మరింత రుచిగా చేస్తుంది. బంగాళాదుంప హల్వాను బెల్లంతో చేస్తే మరింత రుచికరంగా ఉంటుంది. బంగాళాదుంపలలో కూడా ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. దీనిని తయారు చేసేందుకు నెయ్యిని ఉపయోగించాలి. బెల్లం హల్వాకు మీరు పిస్తా, బాదం, ఎండుద్రాక్ష వంటి రకరకాల డ్రై ఫ్రూట్స్ కలుపుకోవచ్చు.
బెల్లం నీరు
బెల్లంను చూర్ణం చేసి వేడినీళ్లలో కలిపి తాగినట్లయితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ప్రేగు కదలికకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఉదయం ఖాళీ కడుపున ఈ నీరు తాగండి. ఊపిరితిత్తులను, గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
లడ్డూ
బెల్లాన్ని చూర్ణంగా చేసి నెయ్యితో కరిగించాలి. తర్వాత తెల్లనువ్వులు కలిపి లడ్డూగా తయారుచేయాలి. నువ్వుల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి కాబట్టి..మీ రోగనిరోధకశక్తి పెరుగుతుంది. అధిక రక్తపోటు ఉన్నవారికి ఇవి ఎంతో మంచింది.