పుట్టిన పసిపాప దగ్గర నుంచి పండు ముసలి వరకు నిద్ర చాలా అవసరం. మనం తీసుకునే విశ్రాంతి మన ఆరోగ్య పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని తెలుసా?!
అన్నం, నీళ్లు.. ఇవి మన జీవితంలో ఎంత ముఖ్యమూ నిద్ర కూడా అంతే ముఖ్యం. మనకు ఎక్కువ గంటలు నిద్రపోవడం చాలా ముఖ్యం. ఇది అందరికీ తెలిసిన విషయమే. జీవితంలో ఎదుర్కునే ఒడిదుడుకులు, ఇతర కారణాల వల్ల నిద్రకు భంగం కలుగుతుంటుంది. దీనివల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందంటున్నారు డాక్టర్లు. కాబట్టి ఏ వయసు వారికి ఎంత నిద్ర అవసరమో తెలుసుకోండి.
పిల్లలు (0 నుంచి 3 సంవత్సరాలు) : 14 నుంచి 17 గంటలు
(4 నుంచి 11 సంవత్సరాలు) : 12 నుంచి 15 గంటలు
(1 నుంచి 2 సంవత్సరాలు) : 11 నుంచి 14 గంటలు
(3 నుంచి 5 సంవత్సరాలు) : 10 నుంచి 13 గంటలు
(6 నుంచి 13 సంవత్సరాలు) : 9నుంచి 11 గంటలు
టీనేజర్స్ (14 నుంచి 17 సంవత్సరాలు) : 8 నుంచి 10 గంటలు
(18 నుంచి 25 సంవత్సరాలు) : 7 నుంచి 9 గంటలు
పెద్దవాళ్లు (26 నుంచి 64 సంవత్సరాలు) : 7 నుంచి 9 గంటలు
(65 ఆ పై వయసు వారు ) : 7 నుంచి 8 గంటలు