ఈ వారం ఓటీటీలో ఇన్ని కొత్త సినిమాలు వస్తున్నాయా.. - MicTv.in - Telugu News
mictv telugu

ఈ వారం ఓటీటీలో ఇన్ని కొత్త సినిమాలు వస్తున్నాయా..

May 16, 2022

తెలుగు చిత్రసీమతోపాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ పరిశ్రమలు కరోనా అనంతరం వారం వారం ఇటు థియేటర్లలో అటు ఓటీటీలో కొత్త సినిమాలను విడుదల చేస్తూ, సినీ ప్రియులను ఆనందింపజేస్తున్నాయి. దాంతో తమ అభిమాన హీరోల సినిమాలు చూస్తూ, ఫ్యాన్స్ తెగ పండగ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఈ వారం ఓటీటీ వేదికగా చాలు సినిమాలు విడుదల అవుతున్నాయి. అవేంటో తెలుసుకుందామా..

1. ‘శేఖర్’

హీరో రాజశేఖర్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘శేఖర్. ఈ సినిమాకు జీవిత దర్శకురాలు. ఈ సినిమా మే 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. మలయాళంలో ఘన విజయం సాధించిన ‘జోసెఫ్’కు రీమేక్‌గా “శేఖర్ రూపుదిద్దుకుంది. ఇందులో రాజశేఖర్ వయసుపైబడిన వ్యక్తిగా సరికొత్త లుక్‌తో సందడి చేయనున్నారు. “శేఖర్’ చిత్రానికి ప్రతి ఒక్కరూ ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారు. కచ్చితంగా అందరికీ నచ్చుతుంది” అని దర్శకురాలు జీవిత ఇదివరకే చెప్పారు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.

2. ‘ధగడ్ సాంబ’.

సంపూర్ణేష్ బాబు, సోనాక్షి జంటగా నటిస్తున్న సినిమా ‘ధగడ్ సాంబ’. ఎస్ఆర్ రెడ్డి దర్శకుడు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 20న విడుదలకు సిద్ధమవుతోంది. ‘సంపూర్ణేష్ బాబును ఇప్పటిదాకా చూడని కొత్త పాత్రలో చూస్తారు. అసభ్యత లేకుండా కుటుంబమంతా కలిసి చూసేలా కథా కథనాలు ఉంటాయి’ అని చిత్ర బృందం చెబుతోంది. జ్యోతి, చలాకీ చంటి, మిర్చి మాధవి, ఆనంద్ భారతి తదితరులు ఇందులో నటించారు.

3. ‘ఆచార్య’

టాలీవుడ్ మెగస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కీలక పాత్రల్లో కొరటాల శివ తెరకెక్కించిన యాక్షన్ చిత్రం ‘ఆచార్య’. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మెగా అభిమానులకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఇప్పుడు ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా మే 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

4. ‘ఆర్ఆర్ఆర్’

ఎన్టీఆర్, రాంచరణ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మే 20 నుంచి జీ5 ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కానుంది.

5. ‘భళా తందనాన’

టాలీవుడ్ యువ హీరో శ్రీవిష్ణు కథానాయకుడిగా చైతన్య దంతులూరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘భళా తందనాన. మే 6న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదలై రెండు వారాల గడవక ముందే ఓటీటీలోకి వచ్చేస్తోంది. మే 20వ తేదీ నుంచి డిస్నీ+హాట్ స్టార్‌లో అందుబాటులోకి రానుంది.

6. ‘భూల్ భులాయా 2?’

బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్, కియారా అద్వాణీ జంటగా అనీస్ బాష్మీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భూల్ భులాయా 2’. టబు కీలక పాత్ర పోషిస్తున్నారు. మే 20న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

7.’12th మ్యాన్’

మాలయాళ నటుడు మోహన్ లాల్ కీలక పాత్రలో నటించిన మిస్టరీ థ్రిల్లర్ ’12th మ్యాన్’. ఈ చిత్రానికి జీతూ జోసెఫ్ దర్శకుడు. ఈ సినిమా మే 20 డిస్నీ+హాట’ లో విడుదల కానుంది. ‘దృశ్యం’, ‘దృశ్యం2’ చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు మోహన్‌లాల్-జీతూ జోసెఫ్ ఇప్పుడు వీరి కాంబినేషన్‌లో మరో చిత్రం వస్తుందంటే అంచనాలు భారీగా పెరిగాయి.

8. ‘పంచాయత్’

అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వెబ్ సిరీస్ ‘పంచాయత్’. లాక్‌డౌన్ సమయంలో విడుదలై నవ్వులు పూయించిన ఈ హిందీ వెబ్ సిరీస్ ఇప్పుడు సీజన్-2కి సిద్ధమైంది. మే 20నుంచి  అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది.

నెటిప్లెక్స్..
1. ది ఇన్విజబుల్ మ్యాన్ (హాలీవుడ్ మూవీ) మే18
2. ద హంట్ (హాలీవుడ్) మే 16
3. వూ కిల్డ్ సారా (వెబ్ సిరీస్-3) మే 18
4. జోంబ్లివీ (హిందీ చిత్రం) మే 20