How many property of Tirupati Balaji?
mictv telugu

తిరుమల శ్రీవారి ఆస్తి ఇన్ని కోట్లా !

November 5, 2022

దేశంలోని ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రాల్లో తిరుమల ఒకటి. రోజుకు కొన్ని లక్షల మంది దేశ నలుమూలల నుంచి శ్రీవారిని దర్శించుకుంటారు.ఈ క్రమంలోనే స్వామివారికి నగదు, వస్తు రూపంలో కానుకలు అందిస్తుంటారు. దీంతో స్వామి వారి ఆస్తులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో లెక్కలేనన్ని కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ… స్వామి వారి ఆస్తుల్లో తరుగుదల కనిపించడం లేదు. దేశవ్యాప్తంగా స్వామి వారికి ఉన్న స్థిరాస్తులను పక్కనపెడితే… ఆయా బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన మొత్తాలు ప్రతీ ఏటా రెట్టింపు అవుతున్నాయి. .

టీటీడీ నిధులను ఏపీ ప్రభుత్వం ఇతరత్రా కార్యక్రమాలకు మళ్లిస్తోందంటూ విమర్శలు రావడంతో టీటీడీ స్వయంగా స్వామి వారి ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేసింది. అందులో భాగంగానే ఆయా బ్యాంకుల్లోని స్వామి వారి నగదు, నగల వివరాలను వెల్లడించింది. . ఆయా జాతీయ బ్యాంకుల్లో స్వామి వారి నగదు డిపాజిట్లు రూ.15,938 కోట్లకు చేరాయి. అదే సమయంలో 10,258.37 కిలోల బంగారం నిల్వలు బ్యాంకుల్లో ఉన్నాయి. ఇంకా దేశ వ్యాప్తంగా కోట్లు విలువ చేసే టీటీడీ భూములు ఉన్నాయి.