how much the Elon Musk college photos sold for at auction
mictv telugu

ఎలన్ మస్క్- లవర్‌ ఫోటోలకు రూ. 1.3 కోట్లు

September 16, 2022

how much the Elon Musk college photos sold for at auction

వేలం వెర్రి అంటే ఇదే. పనికిమాలిన వస్తువులను కూడా వెర్రిగా కొనే కోటీశ్వరులు లోకంలో చాలామంది ఉన్నారు. పిల్లికి బిచ్చం వెయ్యనివాళ్లు డైనోసార్ పెంటను వేలం కొని భద్రంగా దాచుకుంటారు. ఎవరి పిచ్చివాళ్లకు ఆనందమని కొందరు సరిపెట్టుకుంటే, మరికొందరు మాత్రం, ఏదో లాభముంటేనే కొంటారని అంటారు. అమ్ముకోడానికే వేలంలో కొనే వాళ్లు కొందరైతే శాశ్వతంగా దాచుకోడానికి కొనే వాళ్లు కొందరు.

సోది పక్కనబెట్టి విషయంలోకి వెళ్తే ప్రపంచ నంబర్ వన్ కుబేరుడు ఎలన్ మస్క్ కాలేజీ రోజుల్లో ప్రేయసితో కలసి తీయించుకున్న ఫొటోలకు కళ్లు చెదిరే ధర పలికింది. మస్క్ తన లవర్ జెన్నిఫర్ గ్వైయిన్‌తో కలిసి దిగిన ఆ ఫోటోలను గుర్తుతెలియని వ్యక్తి 1,65,000 డాలర్లు (రూ.1.3 కోట్లకుపైగా) కొన్నట్టు అమెరికా మీడియా తెలిపింది. మస్క్‌ తో సంబంధమున్న అరుదైన వస్తువులను ఆర్ఆర్ ఆంక్షన్ సంస్థ వేలం వేసింది. మస్క్ 1994, 199లో పెన్సిల్వేనియా యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు జెన్నిఫర్‌తో ప్రేమాయణం నడిపాడు. ఆమె బర్త్ డే సందర్భంగా పచ్చలు పొదిగిన నెక్లెస్ గిఫ్ట్ ఇచ్చాడు. దీన్ని వేలం వేయగా, రూ.41 లక్షలకు అమ్ముడుబోయింది. ఓ గ్రీటింగ్ కార్డును రూ.13 లక్షలకు కొన్నారు.