మహిళ రాష్ట్రపతిగా ఎన్నికయితే వారిని ఎలా సంబోధించాలంటే.. - MicTv.in - Telugu News
mictv telugu

మహిళ రాష్ట్రపతిగా ఎన్నికయితే వారిని ఎలా సంబోధించాలంటే..

July 29, 2022

రాష్ర్టపతిగా ఇటీవల ద్రౌపది ముర్ము ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే అత్యున్నత పదవిలో ఉన్న ఆవిడను గురువారం పార్లమెంటులో కాంగ్రెస్ నాయకుడు రాష్ట్రపత్ని అంటూ సంబోధించడంతో పెద్ద ఎత్తున దుమారం రేగింది. సోనియా గాంధీ క్షమాపణలు చెప్పాలంటూ కేంద్రమంత్రి స్మృతి ఇరానీ పట్టుబట్టారు. ఇరుపక్షాల మధ్య ఈ అంశంపై వాదోపవాదాలు తీవ్రంగా నడిచాయి. చివరకి ఆ నాయకుడు క్షమాపణలు చెప్పడంతో ఈ అంశం సద్దుమణిగింది. అయితే నిజంగా రాష్ట్రపతిగా మహిళ ఎన్నికైతే ఆమెను ఏమని పిలవాలి? అనే సందేహం చాలా మందికి వచ్చి ఉంటుంది. ఈ సమస్యను ముందే ఊహించిన మన రాజ్యాంగ నిర్మాతలు అప్పుడే ఈ విషయంలో స్పష్టత ఇచ్చారు. మహిళ ఆ పదవిని చేపట్టాల్సి వస్తే రాష్ట్రపతి అని పిలవడం సమంజసంగా ఉండదని, నేత అని సంబోధించాలని రాజ్యాంగ సభ సభ్యుడు కేటి షా అభిప్రాయపడ్డారు. మరికొందరు కెప్టెన్, సర్దార్ అని పేర్లు సూచించారు. అయితే అంబేద్కర్ అభిప్రాయం ప్రకారం ఇంగ్లీష్‌లో ప్రెసిడెంట్ అనీ, హిందీలో ప్రధాన్‌ అనీ, ఉర్దూలో సర్ధార్ అని రాజ్యాంగంలో పేర్కొన్నట్టు ఓ సందర్భంలో వెల్లడించారు. అయితే రాష్ట్రపతిగా మహిళ అయినా, పురుషుడు అయినా వారిని రాష్ట్రపతిగానే పిలవాలని జవహర్ లాల్ నెహ్రూ అప్పట్లో నిర్ణయించారు. ఆ సంప్రదాయమే ఇప్పటికీ నడుస్తోంది.