చలికాలంలో జిడ్డు కారే చర్మానికి ఇవే రక్ష! - MicTv.in - Telugu News
mictv telugu

చలికాలంలో జిడ్డు కారే చర్మానికి ఇవే రక్ష!

November 25, 2022

పొడిచర్మం ఈ కాలంలో మెయింటెన్ చేయడం చాలా కష్టం. అలాగే జిడ్డు కారే చర్మతత్వం ఉన్నవాళ్లు కూడా కొన్ని చిట్కాలు పాటిస్తేనే ఈ కాలంలో మరింత అందంగా కనిపిస్తారు.

_ మామూలు కాలల్లో కంటే ఈ కాలంలో రోజుకి రెండు సార్లు ముఖం కడుగాలి. ఎందుకంటే.. ఎక్కువ ఆయిల్ బయటకు వస్తుంది. దీనికోసం మెడికల్ క్లెన్సర్‌‌ వాడకూదు. క్రీమీ ఫేస్ వాష్ లను ఈ కాలంలో వాడాలి.

‌‌_ చలికాలంలో మొటిమలు, నల్లమచ్చల సమస్య బాధిస్తుంది. క్రమం తప్పకుండా ఎక్స్ఫోలియేట్ చేయడం వల్ల పేరుకుపోయిన ఏదైనా మురికి, అదనపు నూనె వదిలిపోతుంది. దీన్ని వారానికి మూడుసార్లు మాత్రమే ప్రయత్నించాలి. అంతకుమించి చేస్తే కూడా దద్దర్లు వచ్చే ప్రమాదం ఉంది.

_ ఈ కాలంలో మాయిశ్చరైజర్లు తప్పకుండా వాడాలి. కాకపోతే వాటర్ బేస్డ్ అయితే మరింత బెటర్. ఇది ముఖం మీద ఉన్న జిడ్డును చాలా వరకు తగ్గిస్తుంది.

_ సన్ స్క్రీన్ చర్మం పగుళ్లను తగ్గిస్తుంది. ఇంటి నుంచి బయటకు వెళ్లేప్పుడు కచ్చితంగా రాసుకోవడం మరచిపోవద్దు. ఇది కూడా వాటర్ బేస్డ్ అయితే మంచిది.

_ ఈ చిట్కా అన్నిటికంటే ముఖ్యం. 8 నుంచి 10 గ్లాసుల నీళ్లు తాగాలి. దీనివల్ల ముఖం పొడిబారకుండా ఉంటుంది. పైగా టాక్సిన్స్ ఏమైనా ఉన్నా కూడా నీళ్ల ద్వారా వెళ్లిపోతాయి. అలాగే మీరు తినే ఆహారం కూడా ముఖ్యం. నూనె పదార్థాలను తక్కువగా తినండి.