మీ అకౌంట్‌లలోకి పీఎం కిసాన్ డబ్బులు వచ్చాయా.. ఇలా చెక్ చేసుకోండి - MicTv.in - Telugu News
mictv telugu

మీ అకౌంట్‌లలోకి పీఎం కిసాన్ డబ్బులు వచ్చాయా.. ఇలా చెక్ చేసుకోండి

May 31, 2022

ప్రధాని నరేంద్ర మోదీ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్ 11వ విడత డబ్బుల కింద రూ. 20 వేల కోట్లను లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్‌లలో జమ అయ్యాయి. నేడు 10 కోట్ల మందికిపై రైతులకు ఈ డబ్బులు అందాయి. హిమాచల్ ప్రదేశ్‌లో గరీబ్ కల్యాబ్ సమ్మేళనం ముఖ్య అతిధిగా విచ్చేసిన నరేంద్ర మోడీ… అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. 10 కోట్ల మందికి పైగా రైతులకు రూ.21,000 కోట్లు జ‌మ చేసినట్లు కేంద్ర ప్ర‌భుత్వం ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

పీఎం కిసాన్ డబ్బులు వచ్చాయా? లేదా? అనే విషయాన్ని రైతులు సులభంగానే తెలుసుకోవచ్చు. పీఎం కిసాన్ వెబ్‌సైట్‌ https://pmkisan.gov.in/ కి వెళ్లి అందులో స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. దీని కోసం మీరు ఫార్మర్స్ కార్నర్‌లో ఉన్న బెనిఫీషియరీ స్టేటస్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. సెల‌క్ట్ చేసుకున్న త‌ర్వాత తర్వాత కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఆధార్ లేదా ఖాతా నెంబ‌రును ఎంట‌ర్ చేసి ‘గెట్ డేటా’ పై క్లిక్ చేయాలి. స్టేట‌స్ స్క్రీన్‌పై క‌నిపిస్తుంది. ఒక‌వేళ మీరు పీఎం కిసాన్‌కు రిజిస్ట‌ర్ చేసుకుని, ఈ-కేవైసీ పూర్తి చేసి ఉంటే ఖాతాలోకి డ‌బ్బు జ‌మ‌వుతుంది. డబ్బులు రాకపోతే ఎందుకు రాలేదో కారణం కూడా ఉంటుంది. దాన్ని సరిచేసుకుంటే మళ్లీ పీఎం కిసాన్ డబ్బులు పొందొచ్చు.