how to get e ration card in online
mictv telugu

రేషన్ కార్డు పోయిందా? అయితే ఇలా చేయండి

December 20, 2022

ఈ కాలంలో రేషన్ కార్డు ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతీ సంక్షేమ పథకానికి పైకి ఆధార్ తప్పనిసరి అని చెప్తున్నా.. దాంతో సమానంగా రేషన్ కార్డు అవసరమవుతోంది. తక్కువ ధరలకు రేషన్ సరుకులు పొందడం మొదలు, రైతు రుణమాఫీ, పీఎం కిసాన్ యోజన, కల్యాణ లక్ష్మి, డబుల్ బెడ్రూం వంటి అనేక పథకాలకు రేషన్ కార్డు తప్పనిసరి. ఇంతటి కీలకమైన రేషన్ కార్డును పోగొట్టుకుంటే? లేదా ఎక్కడైనా పెట్టి మర్చిపోయి దొరకకుంటే ఎలా? పనులు మానేసుకొని రోజుల తరబడి అధికారుల చుట్టూ తిరగాల్సిందేనా? అయితే ఇవేవీ అవసరం లేదు. ఇంట్లో కూర్చునే రేషన్ కార్డును డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అయితే దీనికి రేషన్ కార్డుకు ఆధార్ కార్డు, మొబైల్ నంబర్ అనుసంధానం అయి ఉండాలి. కరనా సమయంలో తెలంగాణలో కేసీఆర్ ప్రతీ రేషన్ కార్డుకు రూ. 1500 ఆర్ధిక సహాయం చేశారు. ఆ సాయం మీకు అంది రేషన్ కార్డు పోగొట్టుకున్నట్టయితే ఈ – రేషన్ కార్డును సులభంగా పొందవచ్చు.

1. ముందుగా nfsa.gov.in అనే వెబ్ సైటుకి వెళ్లాలి.
2. హోం పేజీలో రేషన్ కార్డును ఎంపిక చేసుకోవాలి.
3. స్టేట్ పోర్టల్ లోని రేషన్ కార్డు వివరాలపై క్లిక్ చేయాలి.
4. రేషన్ కార్డు నెంబర్, కుటుంబ పెద్ద పేరు, ఆధార్ కార్డు నెంబర్, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్ వంటి వివరాలు ఎంటర్ చేయాలి.
5. తర్వాత మొబైల్ కి ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేయాలి.
6. దీంతో పీడీఎఫ్ ఫార్మాట్ లో ఈ – రేషన్ కార్డు వస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి.