అమృతాన్ని రుచి చూసిన వాళ్లు ఈ లోకం లేరు. అమృతం ఎలా ఉంటుందో తెలియకపోయినా అమృతంతో సమానంగా ఉంటుంది మామిడిపండు. కడుపుకు తినే ప్రతి వస్తువూ కల్తీ అవుతున్న ఈ రోజుల్లో మామిడి పండు కూడా కల్తీకి అనర్హం కాదు. త్వరగా మాగబెట్టి మార్కెట్లకు తరలించాలనే వ్యాపారుల స్వార్థం వల్ల రచికర ఫలాలు కాస్తా విషఫలాలుగా మారుతున్నాయి. పళ్లు తర్వగా మాగేందుకు కాల్షియం కార్బైడ్‌ను విపరీతంగా వాడుతున్నారు. దీని వల్ల మన ఆరోగ్యం దెబ్బతింటుంది. కృత్రిమంగా పక్వానికి వచ్చిన పళ్లలో ఆర్సెనిక్, ఫాస్పరస్ వంటి రసాయనాల ఆనవాళ్లు వుంటాయి. వీటి ఫలితంగా విరేచనాలు, వాంతులు, చర్మంపై బొమ్మలు, చూపు దెబ్బతినడం, శ్వాసలో ఇబ్బంది, నిద్రలేమి, మానసిక ఆందోళన వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే కృత్రిమంగా మాగిన పళ్లను తినొద్దని వైద్యులు సలహా ఇస్తున్నారు.
ఇలా గుర్తించొచ్చు
1. కృత్రిమంగా మాగబెట్టిన పళ్లు పుసుపు పచ్చ, ఆకుపచ్చ రంగుల్లో కలసి వుంటాయి. సహజంగా పక్వానికి వచ్చిన పళ్లు ఒకే రంగులో, పసుసు రంగులో వుంటాయి.
2. పళ్లను నీటి బకెట్లో వేసి కూడా తేడాలను కనుక్కోవచ్చు. నీటిలో తేలితే అర్టిఫీషియల్గా మాగినవి. మునిగితే సహజంగా మాగినవిగా భావించాలి.
3. సహజంగా మాగిన పళ్లలో రసం ఎక్కువగా ఉంటుంది. కృత్రిమంగా మాగిన వాటిలో రసం ఉండదు.
4. కృత్రిమంగా మాగిన పళ్లను తింటున్నప్పుడు నాలుకపై ఉన్న రుచి గ్రంథులు(టేస్ట్ బడ్స్) మండుతాయి. తిన్న తర్వాత కడుపునొప్పి, విరేచనాలు కలిగితే అది రసాయనాల ఫలితంగా భావించాలి.