నకిలీ కరెన్సీ మరోసారి కలకలం రేపుతోంది. ప్రకాశం జిల్లాలో పెన్షన్ పంపిణీలో నకిలీ రూ.500 నోటు దర్శనమివ్వడం పెన్షన్ దారులు షాకయ్యారు. స్వయంగా గవర్నమెంట్ నుంచి వచ్చిన నగదులోనే దొంగనోట్లు కనిపించడం తీవ్ర చర్చనీయాంశమైంది. అసలు దీనిని గుర్తించడం ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. ఇంచు మించు నిజమైన నోటులు లాగా అచ్చు దించేయడంతో సామాన్యులకు ఫేక్ కరెన్సీని గుర్తించ లేక నష్టపోతున్నారు. అయితే ఆర్బీఐ ఇచ్చిన సూచనలు ప్రకారం కింది విధంగా రూ.500 నోటు..ఒరిజినలా..? నకిలిదా..? అని తెలుసుకోవచ్చు.
రూ.500 ఒరిజనల్ నోటును ఇలా గుర్తించండి :
*ఒరిజినల్ నోటు మధ్యభాగంలో గాంధీ చిత్రపటం కనిపిస్తుంది.
* భద్రతా తీగ కుడివైపు రిజర్వ్ బ్యాంబ్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంతకం, దానికింద ఆర్బీఐ చిహ్నం కనబడతాయి.
*దానిక పక్కన ఎలక్ట్రోటైప్ వాటర్ మార్క్ గమనించొచ్చు
*దేశంలోని 15 భాషల్లో నోటు విలువను తెలిపే లాంగ్వేజ్ ప్యానెల్ ఉంటుంది.
*లాంగ్వేజ్ ప్యానెల్ పక్కనే ఢిల్లీలోని ఎర్రకోట చిత్రం ఉంటుంది
* నిజమైన నోట్లలో స్వచ్ఛభారత్ నినాదంతో కూడిన లోగో కనిపిస్తుంది.
* నోటు కుడివైపు కిందన చివరిలో భారత జాతీయ చిహ్నం మూడు సింహాల బొమ్మ ఉంటుంది
*ముందుభాగంలో నోటు ఎడమవైపు కిందిభాగంలో తెలుపు, గోధుమవర్ణంలో 500 నెంబర్ కనిపిస్తుంది.
*వెనకభాగంలో ఎడమ వైపు నోటు ప్రింటింగ్ డేట్ కనిపిస్తుంది.
*నోటును కొంచెం వంచి చూస్తే గ్రీన్ కలర్ లో 500 సంఖ్యను గమనించవచ్చు
*నోట్ల సిరీస్ను తెలియజేసే సంఖ్యలు కింది భాగంలో ఎడమ నుంచి కుడికి సైజు పెరుగుతూ కనిపిస్తాయి.
పైన చెప్పిన అంశాలు ఏమైనా నోట్లలో కనిపించకపోతే మీరు ఆనోట్లను తీసుకోవద్దు. ఒకవేళ ఏమైనా అనుమానం ఉంటే వెంటనే బ్యాంకు సిబ్బందిని సంప్రదించి నిర్ధారణ చేసుకోండి.