అమ్మాయిలను ఇంప్రెస్ చేయడం అంత ఈజీ కాదు. ఒక్కో అమ్మాయి ఒక్కోలా ఆలోచిస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కో లక్షణం నచ్చుతుంది. ఒకరిని ఇంప్రెస్ చేయాలంటే కూడా అంత సులభం కాదు. కానీ కొన్ని టిప్స్ ఫాలో అయితే ఖచ్చితంగా ఒకరిని ఇంప్రెస్ చేయొచ్చు.
ఫిజికల్ ఫిట్ నెస్:
చాలా మంది మగవాళ్ళు ఆకర్షణీయంగా కనబడాలనుకుంటారు. అటువంటి వాళ్ళు మొదట ఫిజికల్‌గా ఆకర్షణీయంగా కనబడితే మంచిది. అంటే ఆరోగ్యంగా ఉండడం, మంచిగా డ్రెస్ చేసుకోవడం లాంటివి ఫాలో అవ్వాలి. దీంతో ఆటోమేటిక్‌గా ఎట్రాక్టివ్‌గా కనబడతారు. చాలా మంది ఇతరులను ఇంప్రెస్ చేయడానికి కష్టపడుతారు. మగవాళ్ళ తీరు, ప్రవర్తన బట్టి వాళ్ళలో ఉండే క్వాలిటీస్‌ని బట్టి ఆకర్షణీయంగా కనపడతారు.
మాటలు:
మనం బాగున్నా బాగోలేకపోయినా మంచిగా మాట్లాడితే చాలు ఎవరినైనా ఆకట్టుకోవచ్చును. కామ్ గా కూర్చోవడం అన్నివేళలా పని చేయదు. అలా అని నోటికి ఏది వస్తే అది కూడా మాట్లాడకూడదు. అందరూ మాట్లాడుతున్నప్పుడు మీరు కూడా మాట్లాడ్డానికి ప్రయత్నించండి. దీంతో మిమ్మల్ని మరొకరు ఆదర్శంగా తీసుకుంటారు. పైగా ఆకర్షణీయంగా మీరు వాళ్ళకి కనపడతారు. కాబట్టి ఆకర్షణీయంగా కనపడాలనుకుంటే నోరు విప్పండి.
కాన్ఫిడెన్స్:
కాన్ఫిడెంట్‌గా ఉండే వ్యక్తులు ఆకర్షణీయంగా కనబడతారు. సైకలాజికల్ పరంగా చూసుకున్నట్లయితే కాన్ఫిడెన్స్ కూడా ఒక ఎట్రాక్టివ్ ట్రైట్. కనుక మీరు ఆకర్షణీయంగా కనబడాలంటే ఫస్ట్ కాన్ఫిడెన్స్‌తో ఉండండి. దీని వల్ల మీకు తెలియకుండానే మీరు అందంగా కనిపిస్తారు. దీంతో ఎదుటివారిని ఇట్టే ఆకర్షిస్తారు. కాబట్టి కాన్ఫిడెంట్‌కి మించిన మరో ఆయుధం లేదని మగవారు గుర్తుంచుకోవాలి.
అందం:
కేవలం ఆడవారికి మాత్రమే కాదు, మగవాళ్ళకి కూడా గ్రూమింగ్ అనేది చాలా ముఖ్యం. వాళ్ళని వాళ్ళు మంచిగా ప్రజెంట్ చేసుకోవాలి. మంచిగా వారిని గ్రూమింగ్ చేసుకోవడం వల్ల మంచి ఇంప్రెషన్ అందరికీ కలుగుతుంది. కనుక ఎప్పుడైనా ఆకర్షణీయంగా కనబడాలంటే ఇది చాలా ముఖ్యం అని తెలుసుకోండి. వీటిని పాలో అవ్వడం వల్ల హ్యాండ్సమ్‌గా కనిపిస్తారు. ఎదుటివారిని ఇట్టే ఆకర్షిస్తారు. వీటితో పాటు మీకంటూ సొంత ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవడం మరువొద్దే.
గోల్స్:
మీ కెరియర్ ఉద్యోగం కలలు వంటి వాటిపై ఫోకస్ పెట్టండి. ఇలా ఉండే వాళ్ళపై కూడా ఆసక్తి ఎక్కువ ఉంటుంది పైగా ఆకర్షణీయంగా కనబడతారు. మగవాళ్ళందరూ కూడా ఇంప్రెస్ చేయలేకపోవచ్చు. కానీ అందరికీ కూడా మరొకరిని ఇంప్రెస్ చేయాలనే ఉంటుంది. కొంత మంది ఎంతో ఆకర్షణీయంగా కనబడుతుంటారు. వాళ్ళు ఎవరిని అయినా సరే ఇంప్రెస్ చేస్తూ ఉంటారు.