how to invest in mutual funds?
mictv telugu

మ్యూచువల్ ఫండ్స్ లో డబ్బులు పెడుతున్నారా…అయితే ఇది మీ కోసమే.

January 19, 2023

 

how to invest in mutual funds?

స్టాక్, లేదా షేర్ మార్కెట్. దీనిలో డబ్బులు పెట్టాలని చాలా మందికి ఉంటుంది. అయితే ఎలా పెట్టాలో తెలియక చేతులు కాల్చుకున్నవాళ్ళఉ చాలా మందే ఉంటారు. స్టాక్ మార్కెట్లో చాలా రకాలు ఉంటాయి. వాటిని తెలుసుకోవడం చాలా ముఖ్యం. మనం ఎంత పెడుతున్నాం, ఎలా పెట్టాలి వీటన్నిటి మీద పూర్తి అవగాహన ఉంటే తప్ప ఇలాంటివి చేయకూడదు. ఈక్విటీల్లో నేరుగా పెట్టుబడులు పెట్టడానికి బదులుగా ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెడితే మంచిది అంటున్నారు నిపుణులు. అయితే, ఈ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు రెండు విధాలుగా ఉంటాయి. ఒకటి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ (సిప్), రెండోది లంప్‌సమ్ ఇన్వెస్ట్మెంట్. అయితే మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి లంప్‌సమ్ లేదా సిప్‌లో ఏది బెస్ట్ ఆప్షన్ అనే డౌట్ చాలా మందికి ఉంటుంది. ఈ రెండు ఆప్షన్లు వేర్వేరు పరిస్థితుల్లో ఉపయోగపడతాయి. ఈ రెండింటి మధ్య తేడాలేంటో తెలుసుకుని ఇన్వెస్ట్ చేయడం మంచిది.

స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే నైపుణ్యం, సమయం అందరికీ ఉండకపోవచ్చు. అలాంటి వారికి మ్యూచువల్ ఫండ్స్ మంచి అవకాశంగా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే, మ్యూచ్యువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టడానికి రెండు రకాల మార్గాలు ఉన్నాయి. మొదటిది సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ (SIP), రెండోది లంప్‌సమ్ (Lump Sum) అని ఉంటాయి. అయితే ఈ రెండు ఆప్షన్లలో ఏది బెస్ట్ అని నిర్ణయించుకోవడంలో చాలా మంది వెనకడుగు వేస్తుంటారు. ఏది మంచి ఆప్షన్ అనే డౌట్ ఉంటుంది. ఈ రెండు ఆప్షన్లు వేరు వేరు పరిస్థితుల్లో ఉపయోగపడతాయి.

లంప్ సమ్ ఇన్వెస్ట్ మెంట్:

లంప్ సమ్ అనేది ఫండ్ కొనుగోలుదారులు ఒకేసారి ఏక మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేయడమన్నమాట. పెద్ద మొత్తంలో డబ్బు ఒకేసారి పెట్టుబడి రూపంలో పెడతారు. ఉదారహణకు బోనస్, ఎన్‌క్యాష్‌మెంట్ లేదా ఇతరత్రా మార్గాల్లో డబ్బు అందినప్పుడు ఈ ఆప్షన్ ఎంచుకుంటుంటారు. ఇందులో రిస్క్ అధికంగా ఉంటుంది. అలాగే ఎంత కాల పరిమితికి పెట్టుబడి పెడుతున్నాం, మార్కెట్ ఒడిడుకుల ప్రభావం ఆధారంగా రిటర్న్స్ లభిస్తాయి. అందుకే, వీటిని తట్టుకుని నిలబడే వారే లంప్‌సమ్ ప్లాన్స్ ఎంపిక చేసుకుంటారు. ఇందులో కొన్ని ప్రయోజనాలు కూడా లేకపోలేదు. మార్కెట్లు బాగా క్రాష్ అయినప్పుడు … చాలా కంపెనీల షేర్ల విలువ వాటి జీవితకాల కనిష్ట స్థాయికి చేరుకుంటాయి. అలాంటి సందర్భంలో తక్కువ పెట్టుబడికి ఎక్కువ షేర్ల ను పొందే అవకాశం ఉంటుంది.

సిస్టమాటిక్ ఇన్వెస్ట్ మెంట్:

సిప్ తో మ్యూచువల్ ఫండ్స్‌లో స్థిరమైన పద్ధతిలో పెట్టుబడి పెట్టవచ్చు. క్రమం తప్పకుండా తక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. నెలకు కనీసం రూ.500 నుంచి సిప్ మొదలు పెట్టవచ్చు. భారత్‌లో ఎక్కువ మంది సిప్ ఆప్షన్ ఎంచుకుంటున్నారు. మార్కెట్ అస్థిరత గురించి ఆందోళన లేకుండా క్రమశిక్షణతో పెట్టుబడి పెట్టవచ్చు.

సిప్, లంప్‌సమ్ పెట్టుబడి మార్గాల్లో ఒకటి ఎంచుకోవడం.. మదుపరుల స్వల్ప, దీర్ఘకాలిక లక్ష్యాలపై ఆధారపడి ఉంటుంది. ఏదైనా ఫండ్‌ను ఎంపిక చేసుకునే ముందు నెలవారీ ఆదాయం, ఆర్థిక స్థిరత్వం, పెట్టుబడి లక్ష్యాలు, రిస్క్ వంటి కీలకమైన అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. లంప్‌సమ్, సిప్ పెట్టుబడి నుంచి వచ్చే రాబడి మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. మార్కెట్ బుల్లిష్‌గా ఉంటే లంప్ సమ్ లాభదాయకంగా ఉంటుంది. ట్రెండ్ బేరిష్ లేదా అస్థిరత కొనసాగితే సిప్‌లు లాభాలు అందిస్తాయి.

అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా ప్రకారం.. 2022 డిసెంబర్ నాటికి మ్యూచువల్ ఫండ్ సిప్ అకౌంట్లు 6.12 కోట్లు ఉంటే…. దీని ద్వారా సేకరించిన మొత్తం రూ.13,573 కోట్లు. నెలవారీ సిప్ సగటున రూ.14 వేల కోట్లుగా ఉందని నిపుణులు చెబుతున్నారు.