How to know your credit score on WhatsApp
mictv telugu

వాట్సాప్‌లో మీ క్రెడిట్ స్కోర్ ఇలా తెలుసుకోండి

November 16, 2022

How to know your credit score on WhatsApp

బ్యాంకులు, ఇతర ఆర్ధిక రుణ సంస్థలు మనకు పర్సనల్, హౌసింగ్ వంటి లోన్లు ఇవ్వాలంటే ముఖ్యంగా చూసేది మన క్రెడిట్ స్కోర్‌‌ని. దీన్ని బట్టి మన ఆర్ధిక సామర్ధ్యం ఎంత ఉందో ఆయా సంస్థలు అంచనా వేస్తాయి. దాని ఆధారంగానే రుణాలను మంజూరు చేస్తాయి.

అయితే చాలా మందికి తమ క్రెడిట్ స్కోర్ ఎలా తెలుసుకోవాలో సరిగా అవగాహన ఉండదు. ఇలాంటి వారి కోసం క్రెడిట్ బ్యూరో సంస్థ ఎక్స్‌‌పీరియన్ వాట్సాప్ ద్వారా క్రెడిట్ స్కోర్ సులభంగా తెలుసుకునే సదుపాయాన్ని ప్రారంభించింది. ఇందుకోసం ముందుగా మొబైల్ నుంచి 9920035444 నంబర్‌‌కు hey అని వాట్సాప్ చేయాలి. రిప్లైలో వచ్చే వ్యూ క్రెడిట్ స్కోర్‌‌‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మన పేరు ఎంటర్ చేశాక మెయిల్ ఐడీ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీ ఫోన్ నంబర్‌‌ను ధృవీకరించేందుకు సెండ్ ఓటీపీ నొక్కాలి. అనంతరం వచ్చే ఓటీపీని వాట్సాప్‌‌లో ఎంటర్ చేయాలి. దీని ద్వారా సంస్థ మీ వివరాలను ధృవీకరించుకొని ఆ వెంటనే మీ క్రెడిట్ స్కోర్‌‌‌ని వాట్సాప్‌‌లో పంపుతుంది. అంతేకాక, ఈ మెయిల్ ఐడీకి కూడా పూర్తి వివరాలను పంపిస్తుంది. మెయిల్‌‌లోని వివరాలు చూడాలంటే పాస్ వర్డ్ ఎంటర్ చేయాలి. పాస్ వర్డ్ డీటెయిల్స్ మెయిల్‌‌కి పంపే నివేదికలో ఉంటాయి. కాగా, ఈ సర్వీసు పూర్తిగా ఉచితం. ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.