ఫ్యాషన్ కనిపించడం ఒక ఆర్ట్. ప్టైలిష్ గా కనిపించాలంటే వెస్ట్రన్ దుస్తులే వేసుకోవాలి అనుకుంటారు అందరూ. కానీ అది నిజం కాదు. నిజానికి వెస్ట్రన్, ఎథినిక్ కలిపి వేసుకుంటే ఫ్యాషన్ గా కనిపించడమే కాదు విభిన్నంగా, అందంగా స్టైలిష్‌గా కూడా కనపడతారు. పైగా అందరి కంటే మీరు డిఫరెంట్‌గా ఉండొచ్చు. అయితే మరి ఇక ఆలస్యం దీన్ని ఎలా సెట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
చాలా మంది ఏదైనా పార్టీకి కానీ లేదా ఏదైనా ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు అందంగా ఉండాలని అనుకుంటారు. దానికోసం రకరకాలుగా ట్రై చేస్తుంటారు. కొన్ని చూడ్డానికి చాలా బావుంటాయి, కాని వేసుకుంటే సూట్ అవ్వవు. కొన్ని మనకు బాగా సూట్ అవుతాయని వేసుకుని వెళతాం, తీరా చూస్తే అలాంటిదే మరొకరు కూడా వేసుకుని ఉంటారు. ఇలాంటి సమస్యలేవీ రాకుండా ఉండాలంటే, ఎవరి డ్రెస్‌కి పొంతన లేకుండా అసలు ఎవరు డ్రస్‌కి దగ్గరగా లేకుండా చాలా డిఫరెంట్‌గా రెడీ అవ్వొచ్చు. నిజంగా ఇలా రెడీ అయ్యారు అంటే పక్కా అందరి కళ్ళు మీ మీదే ఉంటాయి.
దోతి మీద క్రాప్ టాప్ లేదా చీర బ్లౌజ్ :
ఇది కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. దీనికోసం మీరు ఎక్కువ డబ్బులని కూడా ఖర్చు చెయ్యక్కలేదు. పైగా ఇలా డ్రస్ చేసుకుంటే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ కూడా అయిపోతారు. ఇది ఈ మధ్య కాలంలో బాగా ట్రెండీ అయింది. దీనికోసం ఒక దోతిని తీసుకోవాలి. ఆ దోతి మీద సెట్ అయ్యేలా.. ఆ కలర్‌ని, ఆ పేటర్న్‌ని గమనించి దాని మీదకి సెట్ అయ్యే క్రాప్ టాప్‌ని కానీ చీర జాకెట్‌ని కానీ వేసుకోవాలి. అంతే మిమ్మల్ని చూసి ఎవరైనా ఫిదా అయిపోతారు. దీన్ని కొట్టే స్టైల్ మరొకటి లేదు.
పెల్పం టాప్ తో చీర:
వినడానికి చాలా కొత్తగా వుంది కదా..? కానీ వేసుకుంటే మాత్రం అదిరిపోతోంది. దీనికి మార్కెట్ లో మంచి డిమాండ్ కూడా ఉంది. ముందు కాస్త డార్క్‌గా ఉండే టాప్‌ని ఎంచుకోవాలి. ఆ తర్వాత మీకు నచ్చినది, సూట్ అయ్యే చీరని దాని మీద కట్టండి. నిజంగా ఇది కూడా అదిరిపోతుంది. పైగా చాలా కొత్తగా ఉంటుంది ఈ లుక్. పైగా ఎంతో డిఫరెంట్‌గా ఉంటుంది. కనుక ఏదైనా ఫంక్షన్స్‌కి వెళ్ళేటప్పుడు ఏం వేసుకోవాలో తోచకపోతే ఇలా ఈ స్టైల్‌ని ట్రై చెయ్యండి. వావ్ అనిపించుకోండి.
జీన్స్ మీద అనార్కలి:
ఈ డ్రెస్ కి కొత్త ఏమీ కొనక్కర్లేదు. కేవలం మన దగ్గర ఉన్న అనార్కలీ, అలానే జీన్స్ తో అందంగా డ్రస్ చేసుకోవచ్చును. జీన్స్ మీద ఆ అనార్కలీ వేసుకుంటే సరికొత్త లుక్ ను ఇస్తుంది. ఫేమస్ బాలీవుడ్ తారలు దీపికా పడుకొనే, తమన్నాభాటియా, అదితీ రావ్ వంటి వాళ్ళు కూడా ఈ ట్రెండ్ ను ఫాలో అయినవాళ్ళే.ఏ ఫంక్షన్స్ లేదా పార్టీస్‌కి వెళ్లాలన్నా ఈ డ్రెస్ అదిరిపోతోంది. ఇందులో చాలా స్టైలిష్‌గా యూనిక్ గా వుంటారు. కావాలంటే ఒకసారి ప్రయత్నం చేసి చూడండి మీకే అర్థమవుతుంది.
లెహంగా మీద షర్టు లేదా క్రాప్ టాప్ :
ఈ లుక్ కూడా చాలా కొత్తగా, డిఫరెంట్ గా ఉంటుంది. ఇలాంటి కాంబినేషన్ లో కనిపంిచేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. ఈ లుక్ లో చాలా ఫ్యాబులెస్ గా వుంటారు. కాబట్టి దీనిని కూడా మీరు ప్రిఫర్ చెయ్యచ్చు. మీరు ఏదైనా పెళ్లి కి కానీ మంచి ఫంక్షన్ కి కానీ వెళ్తున్నారు అంటే.. మీ ఫేవరెట్ షర్ట్ ని మీకు నచ్చిన లెహంగా తో వేసుకుని కాస్త కొత్తగా అందంగా కనిపించ వచ్చు. అలానే పైన వెస్ట్రన్ ఓవర్ కోట్ వేసుకోవచ్చు. నిజంగా ఇది కూడా అదిరిపోతుంది. నార్మల్ గా మనం ఎప్పుడు చూసిన లెహంగా మీద క్రాప్ టాప్ చీర మీద జాకెట్ అన్నీ కూడా కామన్ గా వేసుకుంటాం. కానీ ఇలా తయారైతే ఎంతో వెరైటీ గా ఉంటారు పైగా మీరు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయిపోతారు. ఇందులో అస్సలు అనుమానం లేదు కాబట్టి ఈ అద్భుతమైన ఐడియాస్ ని ఫాలో అయిపోయి అందరి కంటే అందంగా.. అందరి మనసులని దోచుకునేలా తయారైపోండి.
అందంగా కనిపించాలంటే ఏదో చేసేయక్కర్లేదు. కొంచెం క్రియేటివిటీ, కాస్త శ్రద్ధ ఉంటే చాలు. మన ఇంట్లో ఉండే వాటితోనే స్టైల్ గా, ట్రెండీగా కనిపించొచ్చు. అయితే మనం దేని మీద వాటిని దాని మీద వేసుకుంటూ ఉంటాం కానీ ఇలా మరొక దాని మీద మనం మ్యాచింగ్ చేసుకుని వేసుకోవడం వల్ల చాలా స్టైలిష్ గా రెడీ అవ్వొచ్చు.