How to Nailpolish removes without a remover
mictv telugu

రిమూవర్ లేకుండా నెయిల్పాలిష్ తీయొచ్చు!

November 19, 2022

మ్యానిక్యూర్లు, పెడిక్యూర్లు చేసుకొని.. చేతులు, కాళ్లన అందంగా ఉంచుకుంటారు. వాటికి రంగులు వేసి మురిసిపోతుంటారు. అయితే అర్జెంట్గా ఆ నెయిల్పాలిష్ తీయాల్సి వచ్చినప్పుడు రిమూవర్ లేకపోతే ఎలా? ప్రతిదానికీ ఒక ప్రత్యామ్నాయ మార్గం ఉంటుంది. దాన్ని మనం సరైన పద్ధతిలో ఉపయోగించాలంటారు. మీ అందమైన గోళ్ల రంగును తీయడానికి రిమూవర్ అవసరమే లేదు. మీ ఇంట్ల ఉన్న మరికొన్ని వస్తువులు కూడా మీ గోళ్ల రంగును సులువుగా తీసేస్తాయి. ఇంకా చెప్పాలంటే రిమూవర్ కంటే త్వరగా, అందంగా తీసేస్తాయి.

_ టూత్పేస్ట్ మీ గోళ్ల రంగును తీసేస్తుంది. నమ్మకం లేదా? కొద్దిగా టూత్పేస్ట్ని గోళ్ల రంగు మీద రాసి పాత టూత్ బ్రష్తో రుద్దండి. పేస్ట్లో ఉండే ఇథైల్ అసిటేట్ పాలిష్ రిమూవర్గా పనిచేస్తుంది.

_ ఇంట్లో డియోడ్రెంట్ ఉందా? అయితే మీ పని మరింత సులువవుతుంది. ఒకసారి డియోని గోళ్ల రంగు మీద స్ప్రే చేయండి. ఒక నిమిషం ఆగి కాటన్తో రుద్దేయండి. మ్యాజిక్ కనిపించిందా? మామూలు రిమూవర్ కంటే కూడా రంగును బాగా తీసేసింది కదూ!

_ డియోలాగే.. పర్ఫ్యూమ్ కూడా పనిచేస్తుంది. కాకపోతే కాటన్కి బదులు ఇక్కడ టిష్యూని వాడి చూడండి. కచ్చితంగా ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుంది.

_ ఈ మధ్యకాలంలో అందరి దగ్గర ఏది ఉన్నా లేకున్నా హ్యాండ్ సానిటైజర్ మాత్రం బ్యాగులో ఉండి తీరుతుంది. ఇదే మంచి రిమూవర్ అని మీకు తెలుసా? కాటన్ బాల్ మీద కాస్త సానిటైజర్ స్ప్రే చేసి గోళ్ల రంగును ఎంచక్కా తుడిచేయండి.

_ జుట్టుకు వాడే హెయిర్ స్ప్రేలో ఆల్కహాల్ ఉంటుంది. ఇది గోళ్ల రంగు తీయడంలో బాగా పనిచేస్తుంది. అయితే ఇది స్ప్రే చేసిన వెంటనే తుడిచేయాల్సి ఉంటుంది. లేకపోతే ఆ కాటన్ బాల్స్ని మీ గోళ్లను అతుక్కుపోతాయి.

_ ముళ్లును.. ముళ్లుతో తీయాలనే నానుడి తెలుసు కదా! అలాగే గోళ్ల రంగును.. గోళ్ల రంగుతోనే తీయొచ్చు. ఏదైనా పాత రంగును ఇంకా పోని రంగు మీద వేయండి. క్షణం ఆలస్యం చేయకుండా కాటన్తో తుడిచేయండి. ఇలా చేస్తే కొత్తగా వేసిన రంగుతో పాటు.. పాత రంగు కూడా మాయమవుతుంది.