how to purify indoor air naturally
mictv telugu

ఇంటిని ఫ్రెష్ గా ఉంచుకోండిలా….

December 3, 2022

how to purify indoor air naturally

బయటగాలి కన్నా ఇంట్లో గాలి సురక్షితమనుకుంటారు చాలా మంది. పొల్యూషన్ వల్ల బయటగాలి కలుషితమయిపోతుందని, ఇంట్లో అయితే ఆ సమస్య ఉండదనుకుంటారు. కానీ ఇంట్లో గాలి కూడా అంత స్వచ్చమైనది ఏమీ కాదు. బయట గాలి కన్నా నయమేమో కానీ ఇంట్లో పరిశుభ్రంగా లేకపోయినా, వాసన వస్తున్నా అక్కడ గాలి మంచిది కాదన్నట్టే లెక్క. ఇల్లు శుభ్రంగా ఉన్నా కూడా ఒక్కోసారి అదోరకమైన వాసన వస్తూ ఉంుంి. అలా రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు కచ్చితంగా పాటించాల్సిందే. మరి అవేంటో మీకు తెలుసా.

ఇంట్లో ఎప్పుడూ వెంటిలేషన్ బాగా ఉండేలా చూసుకోవాలి. వెంటిలేషన్‌ని పెంచడం వల్ల మంచి గాలి వస్తుంది. కిటికీలు, తలుపులు ఎప్పుడు కూడా మూసివేయకుండా వాటిని తెరిచి ఉంచాలి. ఇలా చేయడంలో వల్ల ఇంట్లో పాత వాసనలన్నీ పోయి ఇంట్లోకి ఫ్రెష్ గాలి వస్తుంది, చక్కగా ఉంటుంది.

దీంతో పాటూ ఇంటిలోపల షూ స్టాండ్, చెప్పుు పెట్టకుండా చూసుకోవాలి.ఇంట్లో షూస్ ఉంటే ఇంట్లో మనతో పాటూ ఇన్ఫక్షన్స్ కూడా కాపురమున్నట్టే లెక్క. దీని వల్ల 50 శాతం కంటే ఎక్కువ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. కాబట్టి ఇంట్లో కాకుండా బయటే షూ స్టాండ్ పెట్టడం మంచిది.

సాల్ట్ క్రిస్టల్స్ అనేవి గాలిని ప్యూరిఫై చేయడంలో హెల్ప్ చేస్తాయి. కాబట్టి.. వీటిని ఇంట్లో పెట్టడం వల్ల గాలి శుభ్రంగా, ప్యూరిఫై అవుతుంది. యాక్టివేటెడ్ చార్‌కోల్ కూడా ఇంటికి ఓ ఫ్రెష్‌నెస్‌ని ఇస్తుంది. దీని వల్ల ఇంట్లోని గాలిలో దుర్గంధం, ముతకతనం పోతుంది. ఫ్రిడ్జ్ లాంటి వాటిల్లో కూడా బొగ్గు ముక్కను పెట్టమని చెబుతుంటారు. ఫ్రిడ్జ్ లో ఎప్పుడైనా ఏమైనా కుళ్ళిపోయినా, పిచ్చి వాసన వస్తున్నా బొగ్గు దాన్ని లాగేస్తుందిట. అలాగే ఇంటిని ఫ్రెష్ గా ఉంచే సువాసన కొవ్వొత్తులు అలాంటివి కూడా మెయింటెయిన్ చేయొచ్చు. ఆర్టిఫిషియల్ వి కాకుండా నేచురల్ గా వాసన వచ్చే వాటిని ఉపయోగిస్తే ఎక్కువ మంచింది.

ఇండోర్ ప్లాంట్స్..

మొక్కలు ఎక్కడ ఉన్నా చాలా మంచిది. ఇంటి బయట, లోపల కూడా మొక్కలు గాలిని ప్యూరిఫై చేస్తాయి. బయట ఎలాంటి మొక్కలు అయినా వేసుకోవచ్చు. కానీ ఇంట్లో అన్ని రకాల మొక్కలు పెరగవు. కాబట్టి దానికి తగ్గట్టు ఉన్న వాటిని తెచ్చిపెట్టుకోవాలి. కొన్ని క్రోటన్స్ మొక్కలకు సూర్యరశ్మి అవసరం ఉండదు. అంతేకాదు అవి చెబు బ్యాక్టీరియాను దూరం చేసి ఆక్సిజన్ ను కూడా అందిస్తాయి. లిల్లీ, అలోవేరా ఇవన్నీ కూడా గాలిలోని చెడు బ్యాక్టీరియాని దూరం చేసి ఆక్సీజన్ అందించే మొక్కలే.

ఎసెన్షియల్ ఆయిల్స్..

ఎసెన్షియల్ ఆయిల్స్ అంటే పెప్పర్ మింట్ ఆయిల్, యూకలిప్టస్ ఆయిల్ మిగతావి కూడా మంచి ప్లజెంట్ స్మెల్ని ఇస్తాయి. వీటిని వాడడం వల్ల మనసు, శరీరానికి థెరపేటిక్ ఎఫెక్ట్ అనిపిస్తుంది.

ఏసీలను క్లీన్ చేయడం..

ఎవరైతే ఏసీని ఎక్కువగా వాడుతుంటారో వారు కచ్చితంగా రెగ్యులర్‌గా వీటిని క్లీన్ చేస్తూ మెంటెయిన్ చేయాలని నిపుణులు చెబుతున్నారు. ఏసీల వల్ల చెడు గాలి ఎక్కువగా జనరేట్ అవుతూ ఉంటుంది. అసలు ఎక్కువ ఏసీలు వాడకుండా ఉంటే ఇంకా మంచిది.