how to recognaise stones in kidney
mictv telugu

నీళ్ళు ఎక్కువ తాగడం లేదా…అయితే ఈ సమస్య తప్పదు

January 10, 2023

how to recognaise stones in kidney

మన శరీరంలో ఉన్న ముఖ్యమైన అవయవాల్లో మూత్ర పిండాలు(కిడ్నీలు) ఒకటి. వాటికి ఎలాంటి సమస్య రాకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత మన చేతుల్లోనే ఉంది. ఎందుకంటే.. శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపి.. మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో కిడ్నీలు కీలక పాత్ర పోషిస్తాయి. వాటి పనితీరులో చిన్న అవాంతరం ఏర్పడినా సమస్యలు తప్పవు. ఎంతో సున్నితంగా ఉండే కిడ్నీలను కాపాడు కోవాలంటే.. నీళ్ళు ఎక్కువగా తాగాలి.

నీరు తక్కువగా తాగేవారి కిడ్నీల్లో రాళ్ళు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఈ రాళ్ళు రకరకాల పరిమాణంలో ఉంటాయి. లవణాలు, ఖనిజాలు, కాల్షియం, యూరిక్ ఆమ్లాలు మూత్రపిండాల్లో చేరి కఠినమైన రాళ్ళుగా రూపాంతరం చెందుతాయి. వీటినో కిడ్నీ స్టోన్స్ అని అంటారు. కిడ్నీలో రాళ్ళు ఏర్పడితే మూత్రవిసర్జనలో సమస్యలు ఏర్పడతాయి. చిన్న రాళ్ళు మూత్రం నుంచి వెళ్లేప్పుడు పెద్దగా సమస్య ఉండదు. కానీ పెద్ద రాళ్ళను బయటకు వెళ్ళేప్పుడే తీవ్రమైన నొప్పి ఏర్పడుతుంది. మరి, కిడ్నీలు రాళ్ళును ఎలా గుర్తించాలి?

మీకు తరచుగా నడుము పక్కన లేదా వెనుక భాగంలో నొప్పి వస్తుంటే కిడ్నీలో రాళ్ళు ఉన్నట్లు అనుమానించి వైద్యులను సంప్రదించాలి.
మూత్రం పోస్తున్నప్పుడు నొప్పిగా ఉన్నా, మండుతున్నట్లు అనిపించినా కిడ్నీలో రాళ్ళు ఏర్పడుతున్నట్లు గుర్తించాలి.
మూత్రం నుంచి రక్తం కారుతుంటే తప్పకుండా వైద్యులను సంప్రదించాలి. ఇది కిడ్నీలో రాళ్ళకు లేదా మరేదైనా తీవ్రమైన సమస్యకు సంకేతం కావచ్చు.

అర్జంటుగా మూత్రం వస్తున్నట్లు అనిపిస్తున్నా సరే, అది కిడ్నీలో రాళ్ళకు సంకేతమని భావించాలి.
మూత్రం చిక్కగా, దుర్వాసనతో వస్తున్నా కిడ్నీలో రాళ్ళు సమస్యగా అనుమానించాలి.

మూత్రం చుక్కచుక్కలుగా వస్తున్నా కిడ్నీ స్టోన్స్‌గా అనుమానించాలి.
ఇంకా.. జ్వరం, పొత్తి కడుపు నొప్పి, వికారం, బరువు తగ్గడం లాంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.

ఎవరికి వచ్చే అవకాశం ఉంది?

కిడ్నలో రాళ్ళు ఎవరికైనా, ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉంది. ఎవరైతే ఉప్పు అధికంగా తీసుకుని, తగినంత నీరు తాగకుండా ఉంటారో, వాళ్ళల్లో ఈ రాళ్ళు ఏర్పడే అవకాశం ఎక్కువ. ద్రవపదార్థాలు తక్కువగా తీసుకునే వారిలో కిడ్నీ స్టోన్స్ త్వరగా ఏర్పడతాయి. అలాగే ఊబకాయం జీవక్రియ రుగ్మతలు మధుమేహం వంటి ఆరోగ్య పరిస్థితులు ఉన్న వారిలో కూడా ఈ స్టోన్స్ ఏర్పడుతాయి.

కిడ్నీలో రాళ్ళు అందరికీ కాదు కానీ, కొందరిలో ఏర్పడుతుంటాయి. ఇందుకు వారి అలవాట్లు కూడా కారణమేనని చెప్పుకోవచ్చు. మినరల్స్, సాల్ట్స్ కలసి రాయి మాదిరిగా మూత్ర పిండాల్లో ఏర్పడేవే కిడ్నీ స్టోన్స్. ఇవి మూత్రపిండాల నుంచి మూత్రాశయంలోకి ప్రవేశిస్తాయి. దీనివల్ల నొప్పి, మంట పలు రకాల సమస్యలు ఎదురవుతుంటాయి.

ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం, అదే సమయంలో నీరు తక్కువగా తాగడం, కొన్ని రకాల ఆరోగ్య పరిస్థితులు కూడా కారణమై ఉండొచ్చు. రాయి పరిమాణం పెద్దగా ఉన్నప్పుడు భరించలేని నొప్పి వస్తుంది. ఇతర జీవనశైలి వ్యాధుల మాదిరిగా వీటిని కూడా నివారించొచ్చు. సరైన ఆహారం తీసుకోవడం, సరిపడా నీరు తాగడంతోపాటు చురుకైన జీవనశైలి వీటి విషయంలో సహాయకారిగా ఉంటాయి.

కిడ్నీలో చాలా వరకు రాళ్ళ పరిమాణం చాలా చిన్నగానే ఉంటుంది. దీంతో అవి మూత్రంతోపాటు బయటకు వెళ్లిపోతాయి. కానీ, వీటి పరిమాణం పెద్దగా ఉంటే మూత్రాశయ మార్గం ద్వారా బయటకు వెళ్ళలేవు. అప్పుడు మనకు సమస్య ఏర్పడుతుంది. కిడ్నీల్లో ఎక్కువగా కనిపించేవి క్యాల్షియం స్టోన్స్.

చికిత్స ఎలా?

కిడ్నీ స్టోన్స్ పరిమాణాన్ని బట్టి చికిత్స ఆధారపడి ఉంటుంది. అవి చాలా చిన్నగా ఉంటే కొన్ని మందుల ద్వారా ఆ రాళ్ళను మూత్రం ద్వారా బయటికి వచ్చేట్టు చేస్తారు. అలాగే ఉప్పు, సోడాలను తగ్గించాలని చెబుతారు. నీళ్ళు అధికంగా తాగితే మూత్రం ద్వారా ఆ చిన్న రాళ్ళు బయటికి వచ్చేస్తాయి. రాళ్ళు మూత్రం ద్వారా వచ్చేందుకు వీలు లేనంత పెద్ద సైజులో ఉంటే వాళ్ళకి శస్త్ర చికిత్సలు అవసరం పడతాయి. ఆ శస్త్ర చికిత్సలో వైద్యులు రాళ్ళని చిన్న చిన్న ముక్కలుగా చేసి, మూత్రం ద్వారా పోయేలా చేస్తారు.