how to reduce hyper tenssion
mictv telugu

ఉప్పు, కారం తినడం మానేస్తే చాలదు….ఇంకా చాలా చేయాలి

January 24, 2023

how to reduce hyper tenssion

మారిన జీవనశైలిలో బీపీ, డయాబెటీస్ చాలా కామన్ అయిపోయాయి. అందరిలో ఏదో ఒక ప్రాబ్లెమ్ ఉంటోంది. కొంతమందికి ఫ్యామిలీ హిస్టరీ అయితే మరికొందరికి తమ అలవాట్లే కారణం అవుతున్నాయి. ఇందులో హైపర్ టెన్షన్ వల్ల దాదాపు 10 శాతానికి మించి గుండె జబ్బుకు గురవుతున్నట్లు వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి. బీపీ ఉన్నవారిలో పది శాతం మంది పక్షవాతం బారిన పడగా మరో అయిదు శాతం కిడ్నీసమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ టెన్షన్‌ వల్ల కొందరికీ బ్రెయిన్‌ స్టోక్‌ కూడా వచ్చే ప్రమాదముంది.

ఇటీవల కాలంలో బ్రెయిన్‌ స్టోక్, గుండెకు సంబంధించిన కేసులు పెరుగుతున్నాయి. హైపర్‌టెన్షన్‌ ఉన్నవారికీ కిడ్నీ రక్తనాళంలో అడ్డంకులు ఏర్పడుతాయి. దీనివల్ల కిడ్నీ దెబ్బతిని పని వేయకుండా పోయే ప్రమాదముంది. అదే విధంగా రక్తనాళాల్లో బ్లాక్‌లు ఏర్పడడం వల్ల గుండె, బ్రెయిన్‌ స్ట్రోక్‌లు వస్తున్నాయి. అన్నింటికన్నా ఆందోళన కలిగిస్తున్న విషయం ఏంటంటే చాలామందికి తమకు హైపర్‌ టెన్షన్‌ ఉన్నట్లు కూడా తెలియకపోవడం. అయితే హైపర్‌ టెన్షన్‌ను గుర్తించగలిగితే దాని వల్ల కలగబోయే ముప్పును నివారించుకోవచ్చు.

గుర్తించటం ఎలా?

బీపీ తీవ్ర స్థాయికీ పెరిగినప్పుడు ముందు తలదిమ్ము మొదలవుతుంది. తర్వాత వివరీతమైన తలనొప్పి, నిద్రలేమి, చూపు మసక బారటం, విపరీతమైన అలనట, చెవుల్లో రింగుమని శబ్దాలు రావడం, శ్వాన తీనుకోవడంలో ఇబ్బంది, గుండె దడ, తికమక పడటం లక్షణాలు కనిపిస్తాయి.

రాకుండా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

బీపీ రాకుండా ఉండాలంటే ముందు మన అలవాట్లను మార్చుకోవాలి. తిని, కూర్చోవడం కాకుండా ఒంటికి పని చెప్పాలి. ప్రతిరోజూ తవ్పని నరిగ్గా 30 నుంచి 45 నిమిషాలు నడవాలి. అస్తమానం కుర్చీకే అతుక్కుని కూర్చోకుండా ప్రతి అరగంటకు ఒకసారి లేచి నాలుగు అడుగులు వేస్తుండాలి.రోజూ వ్యాయామం, యోగా చేయాలి.చిన్న చిన్న విషయాలకు టెన్షన్‌ పడకుండా, కూల్ ఉండడానికి ప్రయత్నించాలి. ఉదయం, సాయంత్రాల్లో మంచి వాతావరణంలో చక్కటి సంగీతం వినడం మంచిది. టెన్షన్‌కు గురవుతున్న నమయంలో నచ్చిన వారితో మాట్లాడడం, మనసుకు నచ్చిన పనులు చేయడం వల్ల అది దూరం అవుతుంది. సిగరెట్, మందులకు దూరంగా ఉంటే మంచిది.

ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

అలవాట్లే కాకుండా మనం తినే తిండిలో కూడా మార్పులు చేసుకుంటే మంచిది. ఒక 30 లేదా 35 ఏళ్ళు వచ్చేవరకు ఏది తిన్ని పర్వాలేదు. కానీ తర్వాత మాత్రం ఆహారంలో మార్పు చేసుకుంటేనే మంచిది. అప్పటివరకు తిన్నది చాలు. అలాని పూర్తిగా మానేయక్కర్లేదు. మన కోరికలనూ అదుపులో ఉంచుకోనక్కరలేదు. కొంచెం డైట్ ఛేంజ్ చేసుకుని…ఎప్పుడైనా మనకు నచ్చినవి తింటూ ఉండొచ్చు.ఆహారంలో ఎక్కువగా కూరగాయలు ఉండేలా జాగ్రత్త వహించాలి.
బత్తాయి, కమలాలు, ద్రాక్ష వంటి పండ్లు ఎక్కువగా తీనుకోవాలి. ఆహారంలో పొటాషియం తగిన మోతాదులో ఉండేలా చూసుకోవాలి. ఎర్రటి మాంసం, మీగడ, వెన్న, నూనె వంటి వాటికీ దూరంగా ఉండాలి. బరువు పెరగకుండా చూనుకోవాలి.

బీపీ ఉంటే:

తరచు వైద్యుడి వద్దకు వెళ్ళి చెక్ చేయించుకోవాలి. మందుల వాడకాన్ని ఒకరోజు కూడా నిలిపేయొద్దు. ఆరోగ్య పరిస్థితిని బట్టి మందుల వాడకాన్ని మార్చుకోవాలి. బీపీతో పాటూ షుగర్‌ , గుండె , థైరాయిడ్‌ పరీక్షలు చేయించుకోవాలి. కొలస్ట్రాల్‌ పెరగకుండా జాగ్రత్త తీసుకోవాలి. మద్యపానం, సిగరెట్లను పూర్తిగా మానేయాలి. కారం, ఉప్పు తగ్గించాలి.