ఇలా చూపించడంతోనే అత్యాచారాలు జరుగుతున్నాయి.. - MicTv.in - Telugu News
mictv telugu

ఇలా చూపించడంతోనే అత్యాచారాలు జరుగుతున్నాయి..

December 1, 2019

రోజురోజుకు నేరాలు, ఘోరాలు పెరుగుతున్నాయి కానీ, తగ్గడంలేదు. తమ బిడ్డ గురించి ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తోందనని కన్నవాళ్లు రంది పెట్టుకుంటున్నారు. కొడుకైతే ఏ అఘాయిత్యాయినికి పాల్పడుతాడోనని, కుమార్తె అయితే ఏ కామాంధుడి చేతుల్లో నలిగిపోతుందోనని భయపడుతున్నారు. సంతానం విషయంలో ఇప్పుడు తల్లిదండ్రుల్లో నెలకొన్న భయాలు ఇవి. దేశవ్యాప్తంగా పశు వైద్యాధికారిణి ప్రియాంక రెడ్డి హత్యాచారం సంచలనంగా మారింది. జాతీయ మీడియాలో ప్రియాంక మృతిపై చర్చిస్తున్నారు. నిందితులకు ఉరిశిక్ష వేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంటోంది.

against girls.

ఇదిలావుండగా ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్ర కథానాయకి నిధి అగర్వాల్ తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీనిపై ఓ నెటిజన్ తీవ్రంగా స్పందించాడు. ‘నీ హాట్ శరీరాన్ని చూపిస్తూ ఈ విధమైన ఫోటోలను షేర్ చేయకు. నీలాంటివాళ్లు ఇలా చేయడం వల్లే సాధారణ అమ్మాయిలు అత్యాచారాలకు గురి అవుతున్నారు’ అని మండిపడ్డాడు. దీంతో నిధి కూడా అతనికి గట్టి సమాధానమే ఇచ్చింది. ‘సమాజంలో ఇంకా నీలాంటి దరిద్రమైన ఆలోచనలుగల వ్యక్తులు ఉన్నారా.. అలాంటివాళ్లను చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది’ అని ఘాటుగా సమాధానం ఇచ్చింది.