స్మోకింగ్ మానాలంటే..ఇలా చెయ్యాలట..! - MicTv.in - Telugu News
mictv telugu

స్మోకింగ్ మానాలంటే..ఇలా చెయ్యాలట..!

September 14, 2017

స్మోకింగ్  ఒకసారి  అలవాటైందంటే  ఓ వ్యసనంలా మారుతుంది. దాని వదిలించుకుందామంటే ఎప్పటికీ వదలదు. ఎంతో మంది ఎన్నోసార్లు  స్మోకింగ్ కు దూరంగా ఉండాలని ఎంతో ట్రై చేస్తారు. కానీ అది మాత్రం సాధ్యం  కాదు. కొందరైతే  ఓ ముహుర్తం పెట్టుకొని మరీ  బర్త్ డేలు , న్యూయర్ లకు మానడానికి ప్రయత్నించిన కూడా ఫలితం ఉండదు, మళ్లీ మెుదటికే వస్తారు, స్మోకింగ్  ను శాశ్వతంగా మానెయ్యాలంటే  గ్రూపు రన్నింగ్ చేయాలని “యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా” (యూబీసీ)కి చెందిన శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి చెప్పారు.

“రన్ టు క్వీట్”  పేరుతో దేశవ్యాప్తంగా రన్నింగ్ క్లినిక్ లను ఏర్పాటు చేశారు. ఇది పది వారాల ప్రోగ్రామ్… ఇది పూర్తి చేసిన వారిలో సగానికి పైగా 50.8 శాతం మంది విజయవంతంగా స్మోకింగ్ కు గుడ్ బై చెప్పారట. 91శాతం మంది సిగరేట్ తాగడాన్ని తక్కువ చేశారట. స్మోకింగ్ చేసే వారు ఒక గ్రూపుగా ఏర్పడి  రన్నింగ్ చేస్తే  ఫలితం ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. ఒకరే రన్నింగ్ చేసి స్మోకింగ్ మానేయాలంటే కుదరని పని అని అంటున్నారు శాస్త్రవేత్తలు. మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ అనే జర్నల్ “లో ఈ  అధ్యాయనం గురించి ప్రచురించారు. కెనడాలోని 168 మంది స్మోకర్స్ 2016 లో ఈ’ రన్ టు క్విటు’ ప్రోగ్రామ్ లో చేరారు. అందులో 72 మంది చివరి  వరకు ఉన్నారు. వీరిలో 37 మంది స్మోకింగ్ ను పూర్తిగా మానేసినట్టు ‘కార్బన్ మోనాక్సైడ్ టెస్ట్ ‘ ద్వారా తెలిసింది. వారానికి ఒక్కసారైనా వాళ్లు ఒకే దగ్గరికి చేరి రన్నింగ్ చేయాలట. ఇంకా స్మోకింగ్ మానడానికి ఏం చేస్తే మానేస్తాం అన్న విషయాలను  చర్చించుకోవాలి. ఆ తర్వాత అందరు కలసి ఐదు కిలోమీటర్లు రన్నింగ్ చేయలి. అంతేకాదు ఆర్గనైషన్ వారు విడివిడిగా ఫోన్లో నే వారికి కౌన్సిలింగ్  కూడా ఇస్తారట.