how to use vitamin tablets
mictv telugu

విటమిన్ టాబ్లెట్లు-వేసుకునే పద్ధతి

December 23, 2022

మన శరీరానికి విటమిన్లు, ఖనిజాలు లాంటివి ఎన్నెన్నో పోఫకాలు చాలా అవసరం. అన్నీ సక్రమంగా ఉంటేనే బాడీ కెరక్ట్ గా పనిచేస్తుంది. వీటిని పొందడానికి ఉత్తమమైన మార్గం తాజా ఆకుకూరలు, కూరలు, పండ్లు, ధాన్యాలు, లాంటి అన్ని పదార్ధాలు తినడం. యితే ఒక్కోసారి అన్నీ తీసుకుంటున్నా మన శరీరానికి తగిన పోషకాలు అందవు. అలాంటప్పుడు విటమిన్ టాబ్లెట్స్ వేసుకుంటాం. అవి మన బాడీని తిరిగి ఉత్తేజితం చేస్తాయి. కానీ ఈ టాబ్లెట్స్ సరిగ్గా పని చేయాలంటే సరైన పద్ధతి లో తీసుకోవాలి.

ఎప్పుడు తీసుకోవాలి:

విటమిన్ మాత్రలను సాధారణంగా ఎప్పుడైనా వేసుకోవచ్చు అని చెబుతారు. కానీ ఇందులో కొన్ని విటమిన్లను ఆహారంతో పాటు తీసుకుంటేనే మంచిది. అప్పుడే మన బాడీ వాటిని బాగా గ్రహిస్తుంది. పరగడుపున కాకుండా తిన్న వెంటనే వేసుకుంటే మంచిది. దీనివల్ల మాత్రల వల్ల అల్సర్ నూ నివారించవచ్చును.

నీటిలో కరిగేవి:

మాత్రలలో రకాలు ఉంటాయి. కొన్ని నీటిలో కరిగిపోతాయి, కొన్ని కొవ్వులో మరికొన్ని డైరెకట్ గా రక్తంలో. వీటి రకాన్ని బట్టి వేసుకుంటే మంచింది. నీటిలో కరిగే విటమిన్లను శరీరం నిల్వ ఉంచుకోదు. అందుకే వీటిని రోజూ తీసుకోవాల్సిందే అని చెబుతున్నారు డాక్టర్లు. విటమిన్ సి, బి1, బి2, బి3, బి5, బి6, బి7, బి9, బి12 ఇవన్నీ నీటిలో కరిగే విటమిన్లే. కాబట్టి వీటిని ఆహారంతో పాటూ తీసుకోవాలి. అయితే అన్ని మాత్రలను ఒకేసారి మింగేయకూడదు. కనీసం పది నిమిషాలు గ్యాప్ వచ్చేలా చూసుకోవాలి. సాధారణంగా బి విటమిన్లు అన్నీ ఒకే మాత్రలో ఉండేటట్లు దొరుకుతాయి. కాబట్టి ఇది వేసుకున్నప్పుడు విటమిన్ సి కూడా వేసుకునేటట్లు అయితే రెండింటికి మధ్య రెండు గంటల తేడా ఉండేటట్లు చూసుకోవాలి. ఎందుకంటే బి12 పనిచేయకుండా విటమిన్ సి అడ్డుకుంటుంది.

కొవ్వులో కరిగేవి:

ఏ, డీ, ఈ, కే విటమిన్లు కొవ్వులో మాత్రమే కరుగుతాయి. మనం ఆహరం ద్వారా తీసుకునే కొవ్వుతో కలిసినప్పుడే ఇవి పని చేస్తాయి. కాబట్టి కొవ్వుతో కూడిన పదార్ధాలతో కలిపి వేసుకుంటే మంచిది.

రక్తంలో కరిగేవి:

వీటిని మనం తీసుకోకపోవడమే మంచివి. డాక్టర్లు చెప్పనిదే వీటిని తీసుకోకూడదు. వీటికి ప్రత్యేక గైడ్ లైన్స్ ఉంటాయి.

ఖనిజాలు:

ఖనిజాలకు సంబంధించిన టాబ్లెట్లు అన్నీ ఒకేసారి వేసుకోకూడదు. ఎందుకంటే అవి ఒకానితో ఒకటి పోటీ పడే అవకాశం ఉంది. అలాంటప్పుడు శరీరం వేటినీ గ్రహించకుండా అయిపోతుంది. కాల్షియం, జింక్, మెగ్నీషియం మాత్రలను కలిపి వేసుకోకూడదు. ఒకవేళ డాక్టర్లు ఈ మూడింటినీ వేసుకోమంటే మాత్రం ఒక్కో పూటకు ఒక్కోటి వేసుకుంటే మంచిది.

ఐరన్:

ఐరన్ మాత్రను ఎలా అయినా వేసుకోవచ్చు. పరగడుపున అయితే ఇంకా మంచిది. అసలు ఏమీ తిననప్పుడే ఐరన్ ను మన శరీరం బాగా గ్రహిస్తుందిట. కాబట్టి నీళ్ళు తాగి అయినా ఈ మాత్రను వేసుకోవచ్చును. బత్తాయి, నిమ్మకాయ వంటి పుల్లని రసాలతో తీసుకుంటే మరీ మంచిది. ఎందుకంటే ఐరన్, విటమిన్ సి రెండూ కలిస్తే శరీరం వీటిని సమర్ధంగా శోషించుకుంటుంది. కానీ కాల్షియం, ఐరన్ మాత్రం అస్సలు కలపకూడదు.

వేరే మందులు:

వేరే మందులు వాడుతూ విటమిన్ టాబ్లెట్లు వాడుతున్నట్టు అయితే కొంత గ్యాప్ ఇవ్వడమే మంచిది. ఎందుకంటే విటమిన్ల వల్ల కొన్ని మందులు పని చేయకపోవచ్చును. థైరాయిడ్ కు వేసుకునే మందులు లాంటి వాటిని కల్షియం, ఐరన్, మెగ్నీషియాలు అడ్డుకుంటాయి. కాబట్టి అలాంటివాటికి కనీసం నాలుగు గంటలు గ్యాప్ ఉండేలా చేసుకోవాలి.

ఏ మందులు వాడినా సొంత జ్ఞానం ప్రదర్శించకపోవడమే ఉత్తమం. చాలా మంది మెడికల్ షాపులో వారిని అడిగి కూడా వేసుకుంటుంటారు. వాళ్ళఉ ఎంత నిత్యం మందులతో గడిపినా డాక్టర్లు కారు, కాలేరు అన్ని విషయం గుర్తు పెట్టుకోవాలి. వాళ్ళు చెప్పినా మందులు వేసుకోకూడదు. డాక్టర్ ని సంప్రదించాకే, వాళ్ళు సూచిచంచిన విధంగానే మందులను వేసుకోవడం ఎప్పుడూ మంచిది.