పెదవుల రంగును ఇలా కూడా వాడొచ్చు! - MicTv.in - Telugu News
mictv telugu

పెదవుల రంగును ఇలా కూడా వాడొచ్చు!

November 21, 2022

లిప్ స్టిక్ అంటే పెదవులకు మాత్రమే వేసుకోవాలా? మీకు ఈ సందేహం రాలేదా? పెదవులకే కాదు.. లిప్ స్టిక్‌ని మరెన్ని విధాలుగా వాడొచ్చో చదువండి.
మన్మథుడు సినిమా గుర్తుందా? అందులో నాగార్జున లిప్ స్టిక్ యాడ్ కోసం ఎలాంటి తిప్పలు పడతాడో గుర్తుందా? అయితే లిప్ స్టిక్ పెదవులకు కాకుండా కండ్లకి వేసి మనల్ని నవ్విస్తాడు. కానీ లిప్ స్టిక్ నిజంగా పెదవులకే వేసుకోవాలని లేదు. కొన్నిసార్లు ఇతర బ్యూటీ ప్రొడక్ట్స్ పనిచేయకపోతే లిప్ స్టిక్‌ని వాటికి బదులుగా వాడొచ్చు. అదెలాగో చదువేయండి మరి..

_ కళ్ల చుట్టూ నల్ల వలయాలు చూడడానికి బాగా కనిపించడం లేదా? ఉబ్బిన కండ్లు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా? మేకప్ పౌడర్లు రాసినా కూడా కనిపిస్తే.. న్యూడ్ లిప్ స్టిక్ వాడండి. అవును.. లిక్విడ్ న్యూడ్ లిప్ స్టిక్ రాస్తే కళ్లు అందంగా కనిపిస్తాయి.
_ లిప్ స్టిక్ బ్లష్‌గా కూడా వాడొచ్చు. నిగనిగలాడే పింక్ కలర్, మ్యాట్ కోరల్ రంగు కూడా బ్లష్‌గా ఉపయోగించొచ్చు. ఈ రంగులు మీ బుగ్గలకు మంచి రంగును ఇస్తాయి. అంతేకాదు.. ఎక్కువ సమయం కూడా పాడవకుండా ఉంటుంది. ఈ రంగును వేళ్లతో బుగ్గలపై బాగా బ్లెండ్ అయ్యేలా చూసుకోవడం మరవద్దు.
_ ఐ షోడో లేకపోతే.. లిప్ స్టిక్ రెండు రకాలుగా వాడుకోవచ్చు. మెరిసేవి, ముదురు, లేత రంగు.. రంగు ఏదైనా కూడా మీ కళ్ల అందాన్ని మరింత పెంచుకోవచ్చు. అంతేకాదు.. న్యూడ్ కలర్ కూడా కళ్ల అందాన్ని రెట్టింపు చేస్తుంది.

_ పండుగ సందర్భాల్లో ఎక్కువగా వేసుకోవడానికి ఇష్టపడే లిప్ స్టిక్ గ్లిటర్ గోల్డ్. ఈ కలర్‌ని పెదవులపై కాకుండా చెంపలపై హైలైటర్‌గా వేయండి. చేతులతో కింద నుంచి పైన వైపు ఈ లిప్ స్టిక్ సమాన పద్ధతిలో రాస్తే బాగుంటారు.

_ మీ ముఖాకృతి సరైనదిగా చూపించడానికి బ్రౌన్ లిప్ స్టిక్ వాడండి. కనుబొమ్మల వంపు, చెంపలపై, దవడ, ముక్కు భాగంలో ఈ లిప్‌స్టిక్ వాడొచ్చు.
_ ఐ లైనర్‌గా కూడా లిప్ స్టిక్ వేసుకోవచ్చు. నల్లని ఐ లైనర్‌ని పక్కన పెట్టి మీకు నచ్చిన షేడ్ లిప్ స్టిక్‌ని బ్రష్ సహాయంతో ఐ లైనర్‌గా వేయండి.