ఏసుక్రీస్తు జనానికి గుర్తుగా జరుపుకొనే క్రైస్తవ పండుగ. ఇది వివిధ దేశాల్లో జరుపుకొనే అతి పెద్ద పండుగ. క్రిస్మస్ పండుగను చాలా కోలాహలంగా జరుపుతారు. అయితే వివిధ భాషల్లో మనం క్రిస్మస్ గ్రీటింగ్స్ చెప్పడం ఎలాగో తెలుసుకోండి.
రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ నుంచి వీధులు.. క్రిస్మస్ సందర్భంగా కొన్ని నగరాలు వెలిగిపోతుంటాయి. అందరూ మెర్రీ క్రిస్మస్ అంటూ శుభాకాంక్షలు చెబుతుంటారు. కానీ స్వంత భాషలో గ్రీటింగ్స్ తెలియచేస్తే ఆ కిక్కే వేరు కదా! అందుకే ఆ లిస్ట్ ఇస్తున్నాం. వాటితో పాటు.. క్రిస్మస్ కోట్స్ కొన్ని మీకోసం..
తెలుగు : క్రిస్మస్ శుభాకాంక్షలు
తమిళం : ఇన్యాస్ క్రిస్మస్
హిందీ : క్రిస్మస్ కి బధాయి
పంజాబీ : హ్యాపీ తే మేరీ క్రిస్మస్
మలయాళం : సంతోషకరమయ క్రిస్మస్
ఉర్దూ : క్రిస్మస్ ముబారక్
బెంగాలీ : సుభా బరాదిన్
గుజరాతీ : మేరీ క్రిస్మాస
ఒడియా : సుఖమయ క్రిస్మస్
ఖాసీ : క్రిస్మస్ బసుక్, స్నెమ్ తుమ్మాయి బసుక్
క్రిస్మస్ 2022 కోట్స్ :
– ‘లివంగ్ రూమ్ లో క్రిస్మస్ చెట్టును చూడండి. ఇంకా మీకు ఏది చెడ్డగా అనిపించదు. ఏదీ బాధించదు, ఏదీ బాధగా అనిపించదు’ – నోరా రాబర్ట్స్, రచయిత్రి
– ‘అందరినీ కలిపి ఉంచేది, అన్ని సమయాల్లోనూ కలిపి ఉంచే రోజు క్రిస్మస్’ -అలెగ్జాండర్ స్మిత్, స్కాటిష్ కవి
– ‘కొన్ని క్రిస్మస్ చెట్టు ఆభరణాలు మామాలుగా కంటే ఎక్కువ మెరుస్తుంటాయి. అవి చాలా కాలం క్రితం ఇచ్చిన ప్రేమ బహుమతిని సూచిస్తాయి’ – టామ్ బేకర్, నటుడు
– ‘మనం ఎంత ఇస్తున్నామో కాదు.. ఇవ్వడంలో మనం ఎంత ప్రేమను ఉంచుతామన్నది ముఖ్యం’ – మదర్ థెరిస్సా
– ‘మానవ జాతి గొప్పది. అపారమైన కుటుంబం. ఇది క్రిస్మస్ సందర్భంగా మన హృదయాల్లో మనం అనుభూతి చెందడం ద్వారా ఇది నిరూపించబడింది’- పోప్ జాన్ XXIII
– ‘మనం ఎప్పుడూ ఒంటరిగా ఉండం. రాత్రి చీకటిగా ఉన్నప్పుడు కాదు, గాలి చల్లగా ఉన్నప్పుడు.. ప్రపంచం చాలా ఉదాసీనంగా ఉంటుంది’ – టేలర్ కాల్డ్ వెల్, నవలా రచయిత