How tooth brush invented
mictv telugu

పంది వెంట్రుకలతో టూత్ బ్రష్

November 8, 2022

మొదట పెరుగు తయారు చేసినప్పుడు తోడు ఎలా వచ్చింది..? విత్తనం ముందా, చెట్టు ముందా..? లాంటి అనుమానాలు మీ కెప్పుడైనా వచ్చాయా! అలాగే మనం రోజూ ఉదయానే పళ్లు తోమే బ్రష్‌ ఎలావచ్చింది.. ఎప్పుడు వచ్చింది? మొదట ఎవరు తయారు చేశారు, అది ఎలా ఉండేది? ఆ విశేషాలు తెలుసా మీకు…తెలియదా? అయితే ఇది చదివేయండి.

మన పూర్వులు వేపపుల్లలతో పళ్లు తోమేవారని అందరికీ తెలిసిందే. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో పళ్లు తోముకోడానికి పుల్లలను వినియోగిస్తున్నారు కూడా! క్రీస్తుపూర్వం 3000 సంవత్సరాలకు ముందే టూత్‌ బ్రష్‌ వినియోగం ఉందట! ప్రస్తుతం వినియోగంలో ఉన్న బ్రష్‌ను మొదట వినియోగించింది మాత్రం చైనా దేశం. 600 యేళ్లకు ముందే మన ప్రపంచానికి బ్రష్‌లను పరిచయం చేసింది ఈ దేశమే.

జూన్ 26, 1498న మొదటిసారిగా ఒక చైనీస్ రాజు టూత్ బ్రష్‌పై పేటెంట్ పొందాడు. ప్రపంచంలో మొట్టమొదటి టూత్ బ్రష్‌ను పంది వెంట్రుకలతో తయారు చేశారట. ఈ టూత్ బ్రష్‌పై ఉండే బ్రస్సెల్స్‌ చాలా గట్టిగా ఉండేవి. వీటిని పందుల మెడ వెనుక ఉండే మందపాటి జుట్టుతో తయారు చేయబడ్డాయి. ఈ వెంట్రుకలను వెదురు కర్రకు కట్టి టూత్ బ్రష్ లు తయారు చేశారు. 20వ శతాబ్ధం వరకు ఈ బ్రష్‌లను యూరప్‌, ఇంగ్లాండ్‌ దేశాలు చైనా నుంచి దిగుమతి చేసుకునేవి.

పంది అనగానే ఛీ యాక్ అనేసుకున్నారా….కానీ ఏం చేస్తాం…1780లో ఇంగ్లాండ్‌కు చెందిన విలియమ్‌ ఈడిస్‌ అనే ఖైదీ కొత్త బ్రష్ లను కనుగొనేంతవరకూ ఈ బ్రష్‌లనే వాడారు మరి. ఆ కాలంలో విలియమ్‌ కూడా పంది వెంట్రుకలతోనే టూత్‌ బ్రష్‌ను తయారు చేసేవాడట. జైలు నుండి విడుదలయ్యాక ‘విజ్‌డమ్‌ టూత్ బ్రష్’ అనే కంపెనీని ప్రారంభించి, ఇంగ్లాండ్‌లో టూత్ బ్రష్‌ల ఉత్పత్తిని ప్రారంభించాడు. ఇప్పటికీ ఈ కంపెనీ ఉండడమే కాదు ఏటా 70 మిలియన్ టూత్ బ్రష్‌లు తయారు చేస్తోంది కూడా.
1950లో డుపాంట్‌ డె నెమోర్స్‌ అనే వ్యక్తి నైలన్‌ బ్రిస్టల్‌ టూత్‌ బ్రష్‌లను ప్రపంచానికి పరిచయం చేశాడు. ఆ తర్వాత అమెరికాలో పెద్ద ఎత్తున టూత్‌ బ్రష్‌ల ఉత్పత్తి ప్రారంభమైంది. అదీ సంగతి ఇలా వచ్చిందన్నమాట!! ప్రస్తుతం మనందరం వాడుతున్న టుత్‌ బ్రష్‌..!