హూస్టన్‌లో ఆకట్టుకుంటోన్న 'నమో తాలి'! - MicTv.in - Telugu News
mictv telugu

హూస్టన్‌లో ఆకట్టుకుంటోన్న ‘నమో తాలి’!

September 22, 2019

ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసందే. ఆదివారం హూస్టన్‌లో జరిగే ‘హౌడీ-మోదీ’ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీపై అభిమానంతో హూస్టన్‌లో ప్రవాస భారతీయురాలు కిరణ్‌ వర్మ ‘నమో తాలి’ పేరుతో భోజనాన్ని తయారు చేశారు.

ఇందులో ‘నమో తాలి మిఠాయి’, ‘నమో తాలి సూరి’ రెండు రకాలున్నాయి. ఈ వంటలన్నీ మనదేశంలో లభించే నేతి రుచులే. అంతే కాకుండా ప్రధాని మోదీ భోజన మెనూలో వివిధ రకాల పచ్చళ్లు కూడా ఉండనున్నాయి. నమో తాలి మిఠాయిలో ష్రిఖండ్‌, క్యారట్‌ హల్వా, రసమలై, బాదం హల్వా ఉంటాయి. నమో తాలి సూరిలో కిచిడీ, మేతి తెప్లా, కచోరి ఉన్నాయి. భారత్‌లో వివిధ రాష్ట్రాల్లో ప్రాచుర్యం పొందిన వంటలను ప్రధాని మోదీ మెనూలో చేర్చినట్లు కిరణ్ వర్మ తెలిపారు. ప్రధాని మోదీకి ఇలా ఆహార పదార్థాలు చేయడం ఇదే తొలిసారని ఆమె పేర్కొన్నారు. హూస్టన్ లో నమో తాలి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.