HP Chromebook 15.6 Launched in India; Priced at Under Rs 30,000
mictv telugu

HP Laptop: తక్కువ ధరకే హెచ్‌పీ ల్యాప్‌టాప్..

March 14, 2023

 

తక్కువ ధరలో ల్యాప్‌టాప్ కోసం చూస్తున్న వారికి, విద్యార్థులకు హెచ్‌పీ కంపెనీ అదరిపోయే న్యూస్ చెప్పింది. తక్కువ ధరలో మంచి ఫీచర్స్ ఉన్న ల్యాప్‌టాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. హెచ్‌పీ క్రోమ్‌ బుక్‌ 15.6 అని పేరుతో మంగళవారం విడదల చేసింది. దీని ధర రూ. 28,999గా ఉంది. ఫారెస్ట్ టీల్, మినరల్ సిల్వర్‌తో సహా రెండు వేరియంట్‌ కలర్స్‌తో అందుబాటులో తీసుకొచ్చారు. ఇంట్లో లేదా క్లాస్‌ రూమ్‌లో చదువుతున్నా కనెక్టివిటీ, ప్రొడక్టీవ్‌గా పనిచేస్తుందని హెచ్‌పీ కంపెనీ పేర్కొంది. ఇక ఈ హెచ్‌పీ క్రోమ్‌బుక్‌ను 15.6ను నదులు, తీర ప్రాంతాల నుంచే ఎక్కువ ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రాల్లో కలిసే ప్లాస్టిక్‌తో, రీసైకిల్‌ చేసిన ప్లాస్టిక్‌తో తయారు చేసినట్లు సమాచారం.

ఫీచర్స్..

*క్రోమ్‌బుక్‌లో సెలెరాన్ N4500 ప్రాసెసర్‌

* మైక్రో-ఎడ్జ్ బెజెల్స్‌తో 15.6 ఇమ్మర్సివ్ డిస్‌ప్లే

* 250 నిట్స్ వరకు పీకే బ్రైట్‌నెస్

* వీడియో కాల్స్‌ మాట్లాడేందుకు వీలుగా వైడ్ విజన్ హెచ్‌డీ కెమెరా

*స్పీకర్ ఎన్‌క్లోజర్ డిజైన్‌తో పెద్ద డ్యూయల్ స్పీకర్‌లు

*వైఫై 6 సపోర్ట్‌తో బలమైన కనెక్టివిటీ

*మైక్రోసాఫ్ట్‌ ఆఫీస్‌ 365కూ ఈ ల్యాప్‌టాప్‌ సపోర్ట్‌

* 11.5 గంటల బ్యాటరీ వర్కింగ్

* గూగుల్‌ అసిస్టెంట్‌, గూగుల్‌ క్లాస్‌రూమ్‌తో పాటు ఫైల్స్‌, ఫొటోలను తొందరగా పంపిచటానికి హెచ్‌పీ క్విక్‌ డ్రాప్‌ సదుపాయం