‘ఎస్సీ, ఎస్టీలు శుభ్రంగా ఉండదు. వాళ్లకు చదువురాదు.. రిజర్వేషన్లు దండగ.. ’ అని అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆంధ్రప్రదేశ్ మార్కెటింగ్ శాఖ మంత్రి సి. ఆదినారాయణ రెడ్డి చిక్కుల్లో పడనున్నారు. ఆయన వ్యాఖ్యలు దళితులను కించపరచేలా ఉన్నాయని, ఆయనపై తగిన చర్య తీసుకోవాలని తెనాలికి చెందిన మేడ కృష్ణ అనే వ్యక్తి రాష్ట్ర మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు.
దీనిపై స్పందించిన హెచ్చార్సీ.. ఈ మొత్తం వ్యవహారంపై అక్టోబర్ 31 వ తేదీలోగా సమగ్ర నివేదిక సమర్పించాలని కడప జిల్లా ఎస్పీని సోమవారం ఆదేశించింది.