తెరపైకి సౌరవ్ గంగూలీ బయోపిక్..! - MicTv.in - Telugu News
mictv telugu

తెరపైకి సౌరవ్ గంగూలీ బయోపిక్..!

February 26, 2020

vbnvn

ఇప్పటికే ధోని, సచిన్‌ల బయోపిక్‌‌లు వచ్చిన సంగతి తెల్సిందే. త్వరలో కపిల్ దేవ్ బయోపిక్ కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్, టెన్నీస్ స్టార్ సానియా మిర్జాల బయోపిక్‌లు కూడా తెరకెక్కుతున్నాయి. తాజాగా గంగూలీ జీవిత చరిత్రను తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతునట్లు సమాచారం. 

టీమిండియా సాధించిన అనేక విజయాల్లో మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కీలక పాత్ర పోషించాడు. అత్యుత్తమ కెప్టెన్లలో ఒకరుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ సేవలు అందిస్తున్నాడు. దాదా అభిమానుల ఆకాంక్షను నెరవేరుస్తూ త్వరలోనే అతని జీవిత చరిత్ర తెరకెక్కే అవకాశాలున్నాయి. గంగూలీ బయోపిక్‌లో బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ పోషించనున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ దర్శక, నిర్మాత కరణ్ జోహార్ ఈ సినిమాకి సంబంధించి గంగూలీ, హృతిక్ రోషన్‌లతో చర్చించినట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన ఉండొచ్చు.