అభిమాని కాళ్లకు నమస్కారం చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ఆయన్ని మెచ్చుకుంటున్నారు. అభిమానులను అతడు ఏ విధంగా గౌరవిస్తాడన్న దానికి నిదర్శనంగా శనివారం ఓ ఘటన జరిగింది. ఫిట్ నెస్ కు సంబంధించి ముంబైలో ఒక కార్యక్రమం నిర్వహించారు. కల్ట్ ఫిట్ కంపెనీ నిర్వహించిన ఓ ప్రైవేట్ ఈవెంట్ లో హృతిక్ రోషన్ గెస్టుగా పాల్గొన్నారు.
Hrithik Roshan touching his fan feet.😭❤ Such a gem of a person he is @iHrithik . There is really no like him.❤ #VikramVedha pic.twitter.com/DAkgijMMgE
— अमित ™ (@HRxfan_boy) August 27, 2022
ఆ కంపెనీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న వారికి గిఫ్టులు ఇవ్వడానికి ఒక్కొక్కరిని వేదిక మీదకు పిలిచారు. అందులో ఓ అభిమానిని పిలవగా అతను స్టేజి మీదకు రాగానే హృతిక్ రోషన్ కాళ్ళకి నమస్కరించాడు. దీంతో వెంటనే హృతిక్ కూడా ఆ అభిమాని కాళ్ళకి నమస్కరించాడు. అతను హృతిక్ రోషన్ కంటే కూడా చిన్నవాడవడం, అతను నమస్కరించగానే హృతిక్ కూడా అతని కాళ్ళకి నమస్కరించడంతో ఈ వీడియో వైరల్ గా మారింది. దీంతో నెటిజన్లు, హృతిక్ అభిమానులు హృతిక్ రోషన్ ని పొగిడేస్తున్నారు. ఇక, సినిమాల విషయానికి వస్తే ఆయన ప్రధాన పాత్రలో నటించిన ‘విక్రమ్ వేద’ వచ్చేనెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కోలీవుడ్ హిట్ మూవీ ‘విక్రమ్ వేద’కు రీమేక్ ఇది. సైఫ్ అలీ ఖాన్ కీలకపాత్రలో నటించారు.