శ్రీవారి లడ్డు మరింత పెద్దగా.. - MicTv.in - Telugu News
mictv telugu

శ్రీవారి లడ్డు మరింత పెద్దగా..

November 21, 2017

తిరుమల  శ్రీవారి లడ్డు సైజును పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. నాలుగు నెలల్లో లడ్డు తయారీ, అన్న ప్రసాదాల తయారీ పోటులను ఆధునీకరించి, అభివృద్ధి చేయనున్నారు. టీటీడీ  జేఈవో శ్రీనివాస్ రాజు ఈమేరకు వెల్లడించారు. డిమాండుకు తగ్గట్టు  ప్రసాదాల పరిమాణాన్ని, పెంచుతామని, సైజును కూడా పెంచడానికి కృషి చేస్తామని ఆయన చెన్నైలో తెలిపారు. అడయార్ ఆనంద భవన్‌లో తీపి వస్తువుల విధానాన్ని పరిశీలించిన , తరువాత అందుకు అనుగుణంగా శ్రీవారి ఆలయంలోని  పోటులో మార్పు  చేస్తామని తెలిపారు.