తెలుగు మహాసభలు.. తొలిరోజే అపశ్రుతి - MicTv.in - Telugu News
mictv telugu

తెలుగు మహాసభలు.. తొలిరోజే అపశ్రుతి

December 15, 2017

ప్రపంచ తెలుగు మహాసభలను అట్టహాసంగా నిర్వహించడానికి హైదరాబాద్ నగరాన్ని అందంగా ముస్తాబు చేయడం తెలిసిందే. అయితే ఆదిలోనే హంసపాదులు, అపశ్రుతులు పడుతున్నాయి. సభల సందర్భంగా బంజారాహిల్స్‌ సమీపంలో ఏర్పాటు చేసిన స్వాగతం తోరణం కుప్పకూలింది.అయితే అటువైపు చెట్టుపైన పడడంతో ఎలాంటి ప్రాణాపాయం తప్పింది. కేబీఆర్ పార్కు చౌరస్తా సమీపంలో దీన్నిహడావుడిగా ఏర్పాటు చేశారు. తోరణం గుంజ నేలలోకి లోతుగా దించకపోవడంతో అది కాస్తా కూలిపోయింది. ట్రాఫిక్ కాసేపు స్తంభించినా, తోరణం రోడ్డుపైన కాకుండా రోడ్డు ఆవలి చెట్టుపైన పడ్డంతో రాకపోకకు పెద్దగా ఇబ్బందికలగడం లేదు. బల్దియా సిబ్బింది కాసేపటికిందటే అక్కడికి చేరుకుని, విరిగిపోయిన తోరణాన్ని తొలగించే పనిలో ఉన్నారు. ఈ తోరణం విరిగిపడంతో నగరంలోని మిగతా తోరణాల పరిస్థితి ఏంటననే అనుమానాలు తలెత్తుతున్నాయి.