Home > కేన్స్ లో సోనమ్‌ మెరుపులు

కేన్స్ లో సోనమ్‌ మెరుపులు


బాలీవుడ్‌ ఫ్యాషన్‌ ఐకాన్‌ సోనమ్‌ కపూర్‌ కేన్స్ లో యువరాణిలా తళక్కున మెరిసింది. తొలిరోజున కాస్త భారతీయ స్టైల్‌ను జోడించి షిమ్మా చీరలో మెరిసిపోయింది. ఈ చీరలో సోనమ్‌ ర్యాంప్‌ వాక్‌ చేయలేదు కానీ ఆమె చీర కట్టుకోవడానికి ఓ కారణం ఉంది. 20న ప్రముఖ హాలీవుడ్‌ నటి, గాయని షెర్‌ 71వ జయంతి. అప్పటికీ ఇప్పటికీ హాలీవుడ్‌లో ఆమె ఫ్యాషన్‌కి పెట్టింది పేరు. ఇప్పుడు సోనమ్‌ వేసుకున్న చీర స్టైల్‌ని పరిచయం చేసింది కూడా షెరే. ఈ సందర్భంగా సోనమ్‌ చీర కట్టుకుని షెర్‌కు నివాళులు అర్పించింది. ఇక రెండో రోజున సోనమ్‌ పింక్‌ కలర్‌ ఎల్లీసాబ్‌ గౌనులో హొయలుపోయింది. హ్యాండ్‌మేడ్‌ కల్యాణ్‌ జ్యువెలరీతో ర్యాంప్‌వాక్‌ చేసింది.

Updated : 22 May 2017 7:33 AM GMT
Next Story
Share it
Top