హువావే నుంచి నాలుగు కెమెరాల ఫోన్ - MicTv.in - Telugu News
mictv telugu

హువావే నుంచి నాలుగు కెమెరాల ఫోన్

April 9, 2019

ప్రపంచంలో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్లలో ఒకటైన ఇండియాలో మరో కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదలైంది. చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ హువావే.. నాలుగు రేర్ కెమెరాలు కలిగిన హువావే పి30 ప్రో స్మార్ట్‌ఫోన్ మంగళవారం ఇండియాలో విడుదల చేసింది. గత నెలలో పారిస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ ఫోన్‌ను ప్రదర్శించారు. దీని ధరను రూ.71,900గా నిర్ణయించారు. దీంతో పాటు హువావే పీ30 లైట్‌ను కూడా కంపెనీ విడుదల చేసింది. ఇది 4జీబీ, 6జీబీ ర్యామ్‌ వేరియంట్లలో లభించనుంది. ఈఫోన్‌ ధరలు వరుసగా రూ.19,900, 22,900. ఇక ప్రారంభ ఆఫర్‌ కింద రిలయన్స్‌ జియో రూ.2,200 క్యాష్‌ బ్యాక్‌ను అందిస్తోంది.

హువావే పీ30 ప్రో ఫీచర్లు

* 6.47 అంగుళాల ఫుల్‌హెచ్‌+డిస్‌ప్లే

* 8జీబీ ర్యామ్‌, 256జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌

* కిరిన్‌ 980 ప్రాసెసర్‌

* ఆండ్రాయిడ్‌ పై

* 40+20+8 మెగాపిక్సెల్‌ రేర్ కెమెరాలతో పాటు, టైమ్‌ ఆఫ్‌ ఫ్లైట్‌ కెమెరా

* 32మెగాపిక్సెల్‌ సెల్ఫీ కెమెరా

* 4,200 ఎంఏహెచ్‌ బ్యాటరీ

* 15W వైర్‌లెస్‌ ఛార్జింగ్‌, 40W సూపర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌

హువావే పీ30 లైట్‌ ఫీచర్లు

* 6.15 అంగుళాల ఫుల్‌హెచ్‌ డిస్‌ప్లే

* 4జీబీ/6జీబీ ర్యామ్‌, 128జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌

* కిరిన్‌ 710 ప్రాసెసర్‌

* 24+8+2 మెగాపిక్సెల్‌ రేర్ ట్రిపుల్‌ కెమెరా

* 32 మెగాపిక్సెల్‌ సెల్ఫీ కెమెరా

* 3,340ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం

* ఫాస్ట్‌ ఛార్జింగ్‌