గోదావరిఖనిలో సుడిగాలి బీభత్సం - MicTv.in - Telugu News
mictv telugu

గోదావరిఖనిలో సుడిగాలి బీభత్సం

April 17, 2019

ఒకవైపు భానుడి భగభగలు.. మరోవైపు వేడి గాలుల భీభత్సం ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. సింగరేణి ప్రాంతమైన పెద్దపల్లి జిల్లాలో గోదావరిఖనిలోని సింగరేణి క్రీడామైనదానంలో మంగళవారం మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా సుడిగాలి ఉవ్వెత్తున ఎగసింది. చూస్తుండగానే అంతకంతకూ పెరుగుతూ స్థానికులను భయాందోళనకు గురి చేసింది.

అమెరికా, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఎక్కువగా కనిపించే ‘టోర్నడో’ను తలపిస్తూ అంతెత్తున ఆకాశంలోకి లేచింది. క్షణక్షణానికీ పెరుగుతూ మరింత పెద్దదైంది. దాదాపు 20 నిమిషాల పాటు మైదానంలో దుమ్ము రేపుతూ సుడులు తిరిగింది. మైదానంలో ఒక చివర మొదలై మరో చివరన ముగిసింది. ఈ భారీ సుడిగాలి సంబంధించిన ఫోటోలను కొందరు కెమెరాల్లో బందించారు . అవి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.