huge amount of cannabis seizure at mortad in Nizamabad district
mictv telugu

మామూలు యాక్సిడెంటే అనుకున్నారు.. లోడ్ చూసి షాక్

June 16, 2022

huge amount of cannabis seizure at mortad in Nizamabad district

ఊహించని రీతిలో నిజామాబాద్ జిల్లా మోర్తాడ్‌లో భారీస్థాయిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. గంజాయి లోడుతో వెళ్తున్న లారీని కారు ఢీకొనడంతో ఈ బండారం బయటపడింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టిన ఘటనలో గాయాలైన క్షతగాత్రులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

ఆ తర్వాత సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మాములు యాక్సిడెంటేగా.. కేసు నమోదు చేసుకుని వెళ్లిపోదామని అనుకున్న వారికి లారీలో ఉన్న లోడ్‌ను చెక్ చేయడంతో దిమ్మతిరిగే షాక్ తగిలింది. అచ్చం పుష్ప సినిమాలో సీన్ మాదిరిగా వంట చెరుకు కింద భారీగా గంజాయి బస్తాలు బయటపడ్డాయి. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ. 2 కోట్లు ఉంటుందని అంచనా వేస్తోన్న పోలీసులు.. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.