కళ్లు ఆర్పలేరు.. కాలువలో వెళ్లిపోయిన భారీ నౌక - MicTv.in - Telugu News
mictv telugu

కళ్లు ఆర్పలేరు.. కాలువలో వెళ్లిపోయిన భారీ నౌక

October 14, 2019

సముద్రాల్లో మనకు భారీ సైజు షిప్పులు కనువిందు చేస్తాయి. షిప్పులో సముద్ర ప్రయాణం మంచి అనుభూతి ఇస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. అయితే అంత పెద్ద నౌక చిన్న కాలువలోకి వస్తే ఎలా వుంటుంది. అరె అంత సన్నని కాలువలోకి నౌక వెళ్తే మునిగిపోగలదు.. అటూ ఇటూ తగిలి ప్రమాదం జరగవచ్చు అని అనికోవచ్చు. కానీ, అవేవి జరగకుండా ఆ నౌక చాలా చాకచక్యంగా ఆ కాలువలో ప్రయాణించింది. క్రూయిజ్ షిప్ అనే అత్యంత భారీ ఓడ ఈ అద్భుతాన్ని ఆవిష్కరిచింది. గ్రీస్‌లో చోటుచేసుకున్న ఈ అద్భుతం తాలూకు వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

24 మీటర్ల వెడల్పు కలిగిన కోరింత్ కాలువలో ఇప్పటివరకు సాధారణ ఓడలు మాత్రమే ప్రయాణించాయి. అలాంటి సన్నని కాలువలో తొలిసారిగా అత్యంత భారీ ఓడ ప్రయాణించి చరిత్ర సృష్టించింది. 22.25 మీటర్ల వెడల్పు కలిగిన ఎంఎస్ బ్రయమార్ ఓడ 929 ప్రయాణికులతోపాటు ఈ కాలువలోకి ప్రవేశించడం మరొక విశేషం. ఈ ఓడకు అటూ ఇటూ కాలువ కేవలం ఒక మీటరు దూరం మాత్రమే ఉండటం గమనార్హం. ఓడ కాస్త అటూ ఇటూ అయినా అది ఒడ్డును ఢీకొట్టే ప్రమాదం ఉంది. ఈ ఓడ మొత్తం పొడవు 196 మీటర్లు కాగా, బరువు 23,344 టన్నులు. ఓ కాలువకు అటూ ఇటూ ఉన్న పర్వతాలను ఢీకొట్టకుండా ఉండేందుకు రెండు టగ్‌బోట్లను వినియోగించారు.

ఈ కాలువను 1880 – 1893 మధ్యకాలంలో నిర్మించారు. ఈ కాలువ లేనప్పుడు ఓడలు పెనిన్సులా మీదుగా 430 మైళ్లు ప్రయాణించేవి. ఏజియన్ సముద్రం మధ్య ఉన్న పర్వతాన్ని తొలచి ఈ కాలువ నిర్మించారు. ఇప్పటివరకు పర్యాటకులు ప్రయాణించే భారీ ఓడలేవీ ఈ మార్గంలో ప్రయాణించకపోవడం గమనార్హం. ఈ కాలువలో ప్రయాణించిన ఈ తొలి క్రూయిజ్ షిప్ అమెరికాకు చెందిన ఫ్రెడ్ ఓల్సెన్ క్రూయిజ్ లైన్స్ సంస్థది.