ఒక్క గులాబీ పువ్వు ధర రూ. 15.. ఘొల్లుమంటున్న లవర్స్  - MicTv.in - Telugu News
mictv telugu

ఒక్క గులాబీ పువ్వు ధర రూ. 15.. ఘొల్లుమంటున్న లవర్స్ 

February 3, 2020

roise.....

కరోనా వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడింది. కూరగాయలు ఇతర వస్తువులు దిగుమతి చేసుకునేందుకు వణికిపోతున్నారు. కానీ పూల వ్యాపారం మాత్రం భారీగా లాభాలను తెచ్చిపెడుతోంది. వాలంటైన్స్ డే దగ్గరకు వస్తున్న నేపథ్యంలో గులాబీ పూలకు డిమాండ్ పెరిగింది. ఇది గులాబీ సాగు చేసిన భారత రైతులకు వరంగా మారింది. మన దేశంలో పండించిన పంట కోసం ఎక్కువగా మక్కువ చూపుతుండటంతో ఒక్కో గులాబీ పువ్వు ధర రూ. 15 పలుకుతోంది. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

ఈసారి చెన్నైలోని హోసూరులో సాగు చేసిన గులాబీలకు డిమాండ్ పెరిగింది. వీటి కోసం సింగపూర్‌, మలేషియా, ఆస్ర్టేలియా, న్యూజిలాండ్‌ తదితర దేశాలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నాయి. కానీ ఈసారి మంచు ప్రభావం, ఎక్కువగా ఉండడం వల్ల దిగుబడి తగ్గింది. ఫిబ్రవరి 14న జరుపుకునే వాలైంటెన్స్‌డే రోజున గులాబీలు పెద్ద ఎత్తున అవసరం ఉండటంతో పోటీ పెరిగి ధరలు పెరిగాయి. దీంతో ఈసారి ప్రతి గులాబి పువ్వు రూ.15 ధర పలుకుతుండటంతో రైతుల దశ తిరిగిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం వాలైంటెన్స్‌డేకి పూలను వివిధ దేశాలకు ఎగుమతి చేసేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.