ఇప్పుడు అందరి కన్నూ ఆయన మీదనే ఉంది. ఎట్లనన్న జేసి ఆయన్ను తమ వైపుకు తిప్పుకోవాలని చూస్తున్నారు. ఆయన తూకం ఎంతనో ? ఆయన కెపాసిటీ, కేపబులిటీ ఎంతనో తేలకుండానే డిమాండ్ ఆమాంతం పెరిగింది. ఆయనే దశవాతారం కమల్ హాసన్. ఇప్పుడు తమిళనాడు పాలిటిక్స్ లో సెంట్రర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు. తమిళనాడులో ఆయన పేల్చుతున్న డైలాగులు హస్తినలో వినిపిస్తున్నాయి.
తమిళనాడుతో పాటు దక్షిణాది వెండి తెరపై ఓ వెలుగు వెలిగిన కుష్బూతో పాటు మరో స్టార్ కోసం కాంగ్రెస్ పార్టీ వెతుకుతున్నది. అందుకే కమల్ వద్దకు నగ్మాతో రాయబారం పంపారని వార్త తమిళనాట కోడై కూస్తున్నది. వారు ఏ మాట్లాడుకున్నారో ? కమల్ నిర్ణయం ఏమిటో ఇంకా తెలియదు కానీ.. కమల్ కు మాత్రం మాంచి డిమాండ్ వచ్చిందనేది మాత్రం వాస్తవం.
తానే పార్టీ పెడుతున్నట్లు… తన అభిమానులు, ప్రజలు సహకరించాలని కమల్ కోరారు. అప్పటి నుండి ఆయనపై పార్టీలకు ఆసక్తి బాగా పెరిగింది. అందరి కంటే ముందుగా కాంగ్రెస్ పార్టీ మేల్కొన్నది. తానూ నాస్తికుడినని కమల్ చెప్పుకున్నారు, అది కూడా డిఎంకే నాయకులను కల్సిన తర్వాత. అందుకే ఆయన డిఎంకే వైపు వెళ్తారనే ప్రచారమూ జరిగింది. దాని తర్వాతనే ఆయన పార్టీ పెడుతున్న విషయంపై కొంత క్లారిటీ ఇచ్చారు.
ఈయన పార్టీ పెడ్తాడనే వార్తలు రాగానే ఏఐడిఎంకే నాయకులు ఆయనను కల్సిందుకు ప్రయత్నాలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడున్న పంచాయితీలు చాలదన్నట్లు కొత్తగా కమల్ ఇష్యూ ఎత్తుకోవడం ఎందుకని కొందరు నాయకులు అన్నారట. అందుకే ఇప్పటికిప్పుడు కమల్ విషయం కాకుండా ఉన్న పంచాయితీలను సెట్ చేసుకుందామని అనుకుంటున్నారట.
రజనీ కాంత్ కూడా ఈమధ్య కామ్ అయ్యారు. కమల్ స్టెస్ ఎటు వేస్తారో చూసిన తర్వాత తన నిర్ణయాన్ని రజనీ చెప్పేలా ఉన్నారు. రజనీ కాంత్ తో బిజెపి నాయకులు టచ్ లో ఉంటూనే ఉన్నారు. కమల్ పువ్వును చేత పట్టుకుని మోడీకి జై కొడ్తరా లేకపోతే తానే కొత్త పార్టీ పెట్టుకుని కబాలి… ద అంటారు చూడాలి. అయితే తమిళనాడులో ఇప్పుడు కమల్ డిబేట్ తో సెంటర్ పాయింట్ అయ్యారు.