Home > Featured > యాదాద్రిలో భక్తుల రద్దీ.. ప్రత్యేక దర్శనం అయినా వెయిట్ చేయాల్సిందే

యాదాద్రిలో భక్తుల రద్దీ.. ప్రత్యేక దర్శనం అయినా వెయిట్ చేయాల్సిందే

Huge Devotees Throng To Yadadri Temple On Sunday

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. వేసవి సెలవులు పైగా వీకెండ్ కావడంతో స్వామి వారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనానికి భక్తులు క్యూ కట్టారు. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో.. ఆలయ ప్రాంగణాలన్నీ కిక్కిరిసిపోయాయి.

స్మామి వారి ఉచిత దర్శనానికి 4 గంటల పైగా సమయం పడుతుండగా.. ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. లడ్డు ప్రసాదం కౌటర్లు, కల్యాణ కట్ట వద్ద భక్తులు పోటెత్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఆలయ సిబ్బంది తగిన ఏర్పాట్లు చేశారు.

Updated : 28 May 2023 8:30 AM GMT
Tags:    
Next Story
Share it
Top