Huge donation Company To Fight Climate Change Patagonia founder Yvon Chouinard
mictv telugu

రూ. 24 వేల కోట్ల కంపెనీని దానం చేశాడు..

September 16, 2022

 Huge donation Company To Fight Climate Change Patagonia founder Yvon Chouinard

ఎంత సంపాదించినా మరింత మరింత సంపాదించాలని ఆరాటపడేవాళ్లు కొందరైతే, ఎంత సంపాదించినా పైకి మూటకట్టుకుని పోతామా, ఆరడుగుల నేల చాలుకదా అని ఉన్నది మొత్తం ఊడ్చేసి దానం చేసే వాళ్లు మరికొందరు. అమెరికాకు చెందిన అపర కుబేరుడు, పెటగోనియా ఫ్యాషన్‌ సంస్థ వ్యవస్థపాకుడు యోవోన్‌ చుయ్‌నార్డ్‌ అలాంటి మనసున్నవాడే. పర్యావరణ సంరక్షణ కోసం కనీవినీ విరాళం అందించి వార్తల్లోకి ఎక్కాడు.

కాలుష్యం కోరుల్లో పడి సర్వనాశనమవుతున్న ప్రకృతిని కాపాడ్డానికి రూ.24 వేల కోట్ల విలువైన తన కంపెనీని ఓ స్వచ్ఛంద సేవా సంస్థలకు దానం చేశాడు. ఈ ఆస్తిలో ఆయన షేర్లు, కుటుంబ సభ్యుల షేర్లు సహా పలు ఆదాయ వనరులు ఉన్నాయి. ‘ఈ భూమే మనకు మిగిలిన ఏకైక వాటాదారు. ప్రకృతిని నగదుగా మార్చుకుంటున్న మనం తిరిగి దానికి ఇచ్చేయాలి’ అని అన్నారాయన. వాతావరణ మార్పులను నివారించి, జీవజాలాన్ని, అడవులను కాపాడ్డానికి ఈ మొత్తం ఖర్చు చేయాలని కోరారు. పెటగోనియా ఫ్యాషన్ కంపెనీ వంద కోట్ల డాలర్ల దుస్తులను అమ్ముతుంటుంది.