Huge donation .. Rs. 60 thousand crores
mictv telugu

భారీ విరాళం.. సమాజం కోసం రూ. 60వేల కోట్లు

June 24, 2022

Huge donation .. Rs. 60 thousand crores

ప్రముఖ పారిశ్రామికవేత్త, అదానీ గ్రూపు అధినేత గౌతమ్ అదానీ సమాజ సేవ కోసం ఏకంగా రూ.60 వేల కోట్లను విరాళంగా ఇచ్చారు. తన 60వ పుట్టిన రోజు సందర్భంగా గురువారం రూ.60,000 కోట్లను సమాజ సేవకు ఇస్తున్నట్టు ప్రకటించారు. గౌతమ్ అదానీ ప్రకటించిన నగదు మొత్తాన్ని అదానీ ఫౌండేషన్ కు బదలాయించనున్నారు.

అయితే, అదానీ ఫౌండేషన్ ఈ నిధులను ఆరోగ్య సంరక్షణ, విద్య, నైపుణ్యాల అభివృద్ధిపై ఖర్చు చేయనున్నట్లు నిర్వహకులు తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో సేవల కోసం ఈ నిధులు ఖర్చుచేయనున్నట్లు పేర్కొన్నారు. గౌతమ్ అదానీ తండ్రి శాంతిలాల్ అదానీ 100వ జయంతి ఈ ఏడాదే అవటం ఇదే ఏడాది ఆయన 60వ పుట్టిన రోజు అవటంతో సమాజ సేవ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు గౌతమ్ అదానీ తెలిపారు.

గౌతమ్ అదానీ.. ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా గుర్తింపు పొందిన బిజినెస్ పర్సన్. 1988లో కమొడిటీ ట్రేడింగ్‌తో వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాడు. అప్పటి నుంచి వ్యాపారం పరంగా అంచలంచెలుగా ఎదిగారు. దేశంలో ప్రస్తుతం బొగ్గు, మైనింగ్, లాజిస్టిక్స్, విద్యుదుత్పత్తి, విద్యుత్ పంపిణీ, గ్రీన్ ఎనర్జీ, ఎయిర్ పోర్టులు, డేటా సెంటర్లు, సిమెంట్ వంటి వివిధ రంగాల్లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ప్రస్తుతం బ్లూమ్ బెర్గ్ ప్రపంచ బిలియనీర్ల జాబితాలో టాప్-10లో గౌతమ్ అదానీ చోటు దక్కించుకున్నారు. ఈ విషయంలో ముకేశ్ అంబానీ కంటే ఒక్క అడుగు ముందున్నారు. ఈ ఒక్క ఏడాదే అదానీ సంపద 15 బిలియన్ డాలర్లు పెరిగింది.