Huge explosion in Kakinada sugar factory.. 3 killed
mictv telugu

కాకినాడ షుగర్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ముగ్గురు మృతి

August 19, 2022

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని వాకలపూడి షుగర్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు చోటు చేసుకొంది.ఈ పేలుడులో ముగ్గురు మృతి చెందారు. మరో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిలో ఇద్దరిని కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. మరో ఇద్దరిని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కన్వేయర్ బెల్ట్ పేలి పేలుడు సంభవించినట్లుగా సమాచారం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న మాజీ మంత్రి కన్నబాబు పరిస్థితిని పరిశీలిస్తున్నారు. బాధిత కుటుంబాలకు ధైర్యం చెబుతున్నారు. మరోవైపు ఈ ఘటనను నిరసిస్తూ ఫ్యాక్టరీ ఎదుట కార్మికులు ఆందోళనకు దిగినట్టుగా సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.