ఫేస్ బుక్ రారాజు ‘అర్జున్ రెడ్డి’ - MicTv.in - Telugu News
mictv telugu

ఫేస్ బుక్ రారాజు ‘అర్జున్ రెడ్డి’

September 11, 2017

విజయ్ దేవరకొండ అలియాస్ ‘అర్జున్ రెడ్డి’..   ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే పేరు. ‘అర్జున్ రెడ్డి’ సినిమాకు ముందు విజయ్  ఓ హీరో, కానీ ఇప్పుడు మాత్రం… రాంగోపాల్ వర్మ చెప్పినట్టు  ‘రియల్ పవర్ స్టార్‘. ఈ సినిమాతో అతని రేంజ్ తారాజువ్వలా దూసుకుపోయింది.  అందుకే  ఆయన ఫేస్ బుక్ ఫాలోవర్స్ కూడా 5 లక్షలు దాటిపోయారు.  ‘పెళ్లి చూపులు’ సినిమాతో  విజయ్ ఫేస్ బుక్  పేజీకి కొంతవరకూ పాపులారిటీ వచ్చింది. కానీ ‘అర్జున్‌ రెడ్డి’ తర్వాత.. అదిరిపోయే రెస్పాన్స్‌ వస్తోంది.  అర్జున్ రెడ్డి సినిమా విడుదలైన వారం పది రోజుల్లోనే ఇతడి ఫేస్‌బుక్‌ పేజీకి లక్షల కొద్దీ లైకులు వచ్చాయి. అంటే చూడండి విజయ్  ఇమేజ్‌ ఏ స్థాయిలో పెరిగిందో అర్థం చేసుకోవచ్చు.  హీరో అంటే.. ఏదో ఒడ్డూ పొడుగుకు ఉన్నాడు, ఫలానా హీరోకు దగ్గర చుట్టమో, దూరపు చుట్టమో.. లేకపోతే ఇంకో ఏదో ఒక సినీకుటుంబం నుంచి రావడం.. అనే నేపథ్యాలను విని వినీ బోర్‌ కొట్టేసింది జనానికి. ఇలాంటి నేపథ్యంలో థియేటర్‌ నుంచి వచ్చిన కుర్రాడు.. హీరోగా సక్సెస్‌ను సొంతం చేసుకుని ఇంత ఇమేజ్ సంపాదించుకున్నాడంటే  తెలుగు సినిమాకు, టాలెంట్ ఉన్నవారికి  మంచిరోజులు  వచ్చినట్టే అని చెబుతున్నారు సినీ విశ్లేషకులు.