లక్నో జట్టుకు భారీ జరిమానా - MicTv.in - Telugu News
mictv telugu

లక్నో జట్టుకు భారీ జరిమానా

April 25, 2022

ఐపీఎల్ 15వ సీజన్ మ్యాచ్‌లు రసవత్తరంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఒక్కొక్క జట్టు ఏడు మ్యాచ్‌లను ఆడాయి. ఈ నేపథ్యంలో ఈసారి ఫలానా జట్టు కప్ గెలుస్తుంది అని క్రికెట్ ప్రియులు వేసుకున్న అంచనాలను తారుమారు చేస్తూ, కొత్త జట్టులు ముందుకు వెళ్తున్నాయి. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై, లక్నో జట్టుల మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే.

ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టుపై లక్నో సూపర్ జెయింట్స్ రెండోసారి విజయం సాధించింది. అయితే, ఐపీఎల్ యాజమాన్యం లక్నోకు భారీ షాక్ ఇచ్చింది. లక్నో జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్‌కు రూ.24 లక్షల ఫైన్ విధించింది.

అంతేకాకుండా, మ్యాచ్‌లో పాల్గొన్న లక్నో జట్టు సభ్యులందరికీ మ్యాచ్ ఫీజులో 25 శాతం లేదా రూ.6 లక్షలు ఏది తక్కువైతే అది చెల్లించాలని రిఫరీ ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు ప్రధాన కారణం.. నిర్ణీత సమయంలోపు 20 ఓవర్ల బౌలింగ్‌ను లక్నో జట్టు పూర్తి చేయలేకపోయింది. ఫలితంగా స్లో ఓవర్ రేటు కారణాన్ని చూపించి, ఫైన్ విధించారు. ఈ సీజన్‌లో లక్నో జట్టుకు ఇది రెండో విడత స్లో ఓవర్ రేటు కావడంతో అధికారులు భారీ ఫైన్ వేశారు.